ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంతలోనే ఒక కారు వారి మీదకు దూసుకొచ్చింది. ఇద్దరు పిల్లలకి గాయాలు అవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.
నగరాల్లో పిల్లలు ఆడుకోవడానికి ఖాళీ స్థలాలు ఉండవు. ఇండ్లలోపల, వీధుల్లోనే ఆడుకుంటారు. బయట రోడ్ల మీద ఆడకండి, బండ్లు తిరుగుతాయి అని పెద్దలు పిల్లలకి రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. పిల్లలు ఆడుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని అపార్ట్మెంట్ లోకి వస్తే అక్కడ కూడా పిల్లల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ కి అటూ ఇటూ మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ వాహనాలు వేగంగా నడపరు కాబట్టి పిల్లలను ఆడుకునేందుకు అనుమతి ఇస్తారు. కానీ అక్కడ కూడా పిల్లలను గుద్దేసి వెళ్ళిపోతే ఇక ఆ తల్లిదండ్రులు ఏమై పోవాలి చెప్పండి. పిల్లలు ఆడుకునే సమయంలో వాహనదారులే చూసి నడపాలి. అటుగా వచ్చే అపార్ట్మెంట్ యజమానులు తమ వాహనాలను ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపాల్సి ఉంటుంది.
పిల్లలకు ఏమీ తెలియదు కదా. పిల్లలు అటూ ఇటూ పరిగెడుతుంటే అనుకోవచ్చు. కానీ ఒక చోట కూర్చుని ఆడుకుంటున్న పిల్లల మీద కారు ఎక్కించడం అంటే అంతలా కళ్ళు మూసుకుపోయి ఉన్నారా అని స్థానికులు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీలోని ఓ అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ముగ్గురు పిల్లలు ఒక చోట కూర్చుని ఆడుకుంటున్నారు. ఇంతలో మెల్లగా ఎస్యూవీ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ తెల్ల కారు ఒకటి వస్తుంది. నెమ్మదిగానే వస్తుంది కదా అని పిల్లలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ కారు తమ మీదకు దూసుకొస్తుందని తెలిసేలోపు ఇద్దరి మీద ఆ కారు ఎక్కేసింది. తప్పించుకునే వీలు లేకుండా పోయింది. ఒక బాబు మాత్రం కారు దూసుకొస్తుండడాన్ని గమనించి పక్కకు తప్పుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు అవ్వగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
విషయం తెలుసుకున్న అపార్ట్మెంట్ నివాసులు చికిత్స కోసం పిల్లలను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. 7 ఏళ్ల బాబు మీదకు, అలానే మరొక బాబుపైకి కారు దూసుకెళ్లినట్టు ఫుటేజ్ లో కనబడుతోంది. ఈ ఘటన ఫిబ్రవరి 18 రాత్రి 8 గంటల సమయంలో చోటు చేసుకుంది. బాబు తల్లి రాయ్ దుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కారు డ్రైవర్ వెంకటేష్ పై (32) నిర్లక్ష్యంగా నడిపినందుకు గాను మోటార్ వెహికల్ యాక్ట్స్ 337, 184 కింద కేసు నమోదు చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసి ఉండవచ్చునని లేదా మద్యం తాగి నడిపి ఉండవచ్చునని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి నిర్లక్ష్యంగా కారు నడుపుతూ పిల్లల మీదకు ఎక్కించిన డ్రైవర్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.
Three children who were innocently playing were hit by a car in Chitrapuri colony of #Hyderabad. Two of them are injured, of them one is in critical condition and availing treatment at KIMS. Accident recorded on #CCTV footage. pic.twitter.com/VCvUWhYqfG
— Rajeswari Parasa (@ParasaRajeswari) February 20, 2023