వాహనాలను అతి వేగంగా నడుపుతూ నియంత్రణ కోల్పోయి ఎన్నో ప్రమాదాలకు కారణాలు అవుతున్నారు కొంతమంది డ్రైవర్లు.
నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎక్కడో ఓ చోట అనుకోని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డ్రైవింగ్ పై అవగాహన లేక కొందరు పొరపాట్లు చేస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రమాదాల పాలవుతున్నారు. అతి వేగంతో ర్యాష్ డ్రైవింగ్ తో ప్రమాదాల పాలవుతున్నారు. అనవసరంగా అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళ కొత్తకారుతో బీభత్సం సృష్టించింది. ఆ ప్రమాదంలో స్విగ్గీ డెలిరీ బాయ్ చనిపోయాడు. ఓ ఇంట్లోకి స్కార్పియో వాహనం దూసుకెళ్లిన ఘటన కూడా చూశాం.. అటువంటి సంఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ కారు బైక్ ను ఢీకొని ఏకంగా హోటల్లోకి దూసుకెళ్లింది. ఈ దృశ్యాలను సీసీ కెమారాల్లో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ వనస్థలిపురంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టి ఓ హోటల్లోకి దూసుకెళ్లింది. బైక్‌పై వెళుతున్నవ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరి అని.. అతివేగం అనర్దదాయకం అని హెచ్చరించినా ఫలితం లేకుండా పోతుంది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.