ఇటీవల కాలంలో వరుసగా తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు సంబవిస్తూనే ఉన్నాయి. గుండె దడ, ఆందోళన, ఎక్కవ వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. కొంతమందికి సీపీఆర్ చేసి శ్వాస అందించినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుసగా గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. అప్పటి వరకు మనతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. కొంతమందికి సీపీఆర్ చేసి బతికించినా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిస్తున్నారు. ఈ మద్య కాలంలో చిన్న పెద్దా అనే తేడా లేకుండా ఎంతోమంది గుండెపోటుతో చనిపోతున్నారు. గత రెండు నెలల నుంచి ఈ సంఖ్య మరీ ఎక్కువ అయిపోయింది. తాజాగా పెద్ద అంబర్ పేట్ ఓ కారు డ్రైవర్ గుండెపోటుతో కన్నుమూశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ లో ఈ మద్య వరుస గుండెపోటు మరణాలతో ప్రజలు భయాందోళనకు గురైతున్నారు. తాజాగా పెద్ద అంబర్ పేట్ లో ఓ వ్యక్తి కారు డ్రైవ్ చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు వచ్చింది.. వెంటనే కారు అపాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని కారులో నుంచి బయటకు తీసుకు వచ్చారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న రామన్న పేట సీఐ మోతీరాం గమనించి వెంటనే బాధితుడికి సీపీఆర్ చేశాడు. కాసేపటికి డ్రైవర్ స్పృహలోకి వచ్చాడు. వెంటనే అంబులెన్స్ ని పిలిపించి అతన్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు సీఐ. ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలోనే అతడు ప్రాణాలు విడిచినట్టు వైద్యులు తెలిపారు. సీఐ సీపీఆర్ చేసి శ్వాస అందించినా.. మృత్యువు అతన్ని వెంటాడింది.
పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు.. మరే ఇతర కారణాలు కావొచ్చు.. ఈ మద్య గుండెపోటు మరణాలు మరీ ఎక్కువ అవుతుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. ఏ క్షణంలో గుండెపోటు వచ్చి చనిపోతామో అన్న భయం పట్టుకుంది. అప్పటి వరకు మనతో హ్యాపీగా మాట్లాడుతూ.. సంతోషంగా గడిపిన ఉన్నవాళ్లు అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ తో ఉన్నచోటే కుప్పకూలిపోయి చనిపోతున్నారు. అధిక వ్యాయామం, మానసిక ఒత్తిడి, దీర్ఘకాలం గాలి కాలుష్యం బారిన పడ్డవారు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడి ఎక్కువగా గుండెపోటు వల్ల చనిపోతున్నారని వైద్య నిపుణులు చెప్తున్నారు. గత రెండు దశాబ్ధాలుగా 40 ఏళ్ల లోపు ఉన్న యువత ఎక్కువగా గుండెపోటుతో చనిపోయినట్లు ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వేలో తేలింది.