దేశ వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఎంతో ఘనంగా జరిగిన వేళ.. ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. వివాహాలు, ఇతర శుభాకార్యాల్లో పార్ట్‌టైమ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోన్న ఓ యువతి.. కొందరి ఆకతాయిల ఆగడాలకు బలైంది. ఆ పోకిరీలు యువతిని ఢీకొట్టి కొన్నికిలోమీట్లర్ల దూరం ఈడ్చుకుంటూ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే యువతి డ్రెస్.. కారు టైర్‌లో చిక్కుకోవడంతో.. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా.. నగ్నంగా రోడ్డు పడి ఉంది. ఈ ఘటనతో ఢిల్లీ నగరం అట్టుడికింది. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ ఆప్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో పోలీసులు నిరసన కారులపై వాటర్ కేన్లను ప్రయోగించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ అమన్ విహార్‌కి చెందిన అంజలి శుభకార్యాల్లో పార్ట్ టైమ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిషోస్తుంది. ఆమె తండ్రి మరణించడతో కుటుంబ భారం అంతా ఆ యువతిపై పడింది. అంజలికి తల్లితోపాటు నలుగురు అక్కా చెళ్లెళ్లు, ఇద్దరు తమ్ముళ్లున్నారు. ఈక్రమంలో అంజలి ఆదివారం ఓ ఫంక్షన్‌కు హాజరై.. తిరిగి ఇంటికి వెళ్తుండగా.. ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తోన్న కారు.. అంజలి స్కూటీని ఢీకొట్టింది. అనంతరం అంజలిని కొన్ని కిలోమీట్లర దూరం ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ క్రమంలో అంజలి డ్రెస్.. కారు టైర్‌లో చిక్కుకోవడంతో.. ఆమె ఒంటి మీద నూలు పోగు లేకుండా.. నగ్నంగా పడి ఉంది.
సోమవారం తెల్లవారజామున.. 3.30 గంటలకు రోహిణి జిల్లాలోని కంఝవాల్ పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి.. కుతుబ్‌గఢ్ వైపుగా వెళ్తున్న గ్రే బాలెనో కారు.. యువతిని లాక్కెళ్లుతూ ఉన్నదని స్థానికులు తెలిపారు. అదే విధంగా 4.11 గంటలకు మరికొందరు పోలీసుకు కాల్ చేసి.. రోడ్డుపై మహిళ మృతదేహం పడి ఉందని తెలిపారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు కారు నంబర్ ఆధారంగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమ కారు ఓ స్కూటీని ఢీ కొట్టిందని చెప్పిన నిందితులు.. యువతిని తమ కారు కొన్ని కిలోమీటర్ల మేరకు లాక్కొచ్చిందనే విషయం అసలు తమకు తెలియదని చెప్పడం గమానార్హం. అయితే ఈ ఘటనపై తాజాగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి మృతదేహం 4 కిలోమీటర్ల మేర కాకుండా.. గంటన్నర పాటు 13 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ గంటన్నర సమయం పాటు ఆ యువతి ఎంతో నరకం అనుభవించిందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ ఘటనపై మొదట పోలీసులు మాట్లాడుతూ.. యువతి మృతదేహాన్ని 4 కిలోమీటర్ల మేర లాకెళ్లిందని అన్నారు. ఇప్పుడు మరోలా చెప్తున్నారు అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఘటనకు సంబంధించి మరింత సమాచారం సేకరించేందు వారితో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయిస్తున్నారు. అయితే ఇది ప్రమాదం కాదని, అత్యాచారం చేసిన ఆపై హత్య చేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ నగరంలో తీవ్ర స్థాయిలో ఆందోళన జరుగుతోంది. యువతి మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయాన్ని ముట్టడించే యత్నం చేశారు. పోలీసులు వారిని ఎంతగా నిలువరించిన.. ఫలితం లేకపోవడంతో నిరసనకారులపై వాటర్ కేన్లను ప్రయోగించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.