పటిష్టమైన పోలీసుల భద్రత ఉండే విమానాశ్రయంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
ఇప్పుడు దొంగతనాలు ఎక్కువైపోయాయి. చోరీలు ఒకప్పుడు రాత్రిపూటే జరిగేవి. కానీ ఇప్పుడు పగటిపూట అందరూ చూస్తుండగానే కేటుగాళ్లు రెచ్చిపోయి దొంగతనాలు చేస్తున్నారు. సాధారణ ప్రజలు ఉన్న చోట అంటే ఏమో అనుకోవచ్చు.. ఫుల్ సెక్యూరిటీ ఉన్న దగ్గర కూడా దొంగతనాలు చేసేస్తున్నారు. అలాంటి ఓ దొంగతనానికి సంబంధించిన వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కెనడాలోని టొరంటో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారీ చోరీ జరిగింది. కోట్లాది రూపాయల విలువైన బంగారం, ఇతర వస్తువులతో నిండిన ఒక కార్గో కంటైనర్‌ను దుండగులు అపహరించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ దొంగతనం ఏప్రిల్ 17న జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
టొరంటో విమానాశ్రయంలో ఒక విమానం నుంచి సుమారు ఆరు చదరపు అడుగులు ఉన్న ఓ కంటైనర్‌ను సోమవారం నాడు కిందకు దించారు. దీంట్లో దాదాపు 20 మిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన బంగారం, ఇతర వస్తువులు ఉన్నట్లు సమాచారం. సురక్షిత ప్రాంతానికి తరలించే క్రమంలో ఈ కంటైనర్ అదృశ్యమైంది. ఈ దొంగతనం జరిగి మూడ్రోజులు గడిచినా ఇప్పటిదాకా దుండగులను పోలీసులు పట్టుకోలేకపోయారు. కెనడా విమానాశ్రయంలో భారీ దొంగతనాలు జరగడం ఇదే తొలిసారి కాదు. 1952లో టొరంటో విమానాశ్రయంలో 2.15 లక్షల డాలర్లు విలువైన బంగారాన్ని ఎవరో ఎత్తుకెళ్లారు. దీని విలువ ఇప్పుడు 23 లక్షల డాలర్లకు సమానమట. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు దొంగల్ని పోలీసులు పట్టుకోలేకపోయారు.
Thieves at Canada’s busiest airport made off with gold and other valuables estimated to be worth just over $20 million Canadian dollars, police said Thursday. No arrests have been made yet and an investigation is underway. https://t.co/IlsTWUTS0M
— The Washington Post (@washingtonpost) April 21, 2023