ఒక యువతి బస్టాప్‌లో బస్ కోసం ఎదురుచూస్తుంది. ఇద్దరు యువకులు బైక్‌లపై వచ్చి డ్రాప్ చేస్తామని నమ్మించబోయారు. దానికి అంగీకరించని ఆ యువతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన బెంగుళూరులోని వివేక్ నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బీకామ్ డ్రాపవుట్ అయిన 25 ఏళ్ళ యువతి ఈస్ట్ బెంగుళూరులో నివాసం ఉంటుంది. ఆ యువతి ఈజీపురలో ఉన్న టెన్త్ క్రాస్ రోడ్‍లో ఉన్న తన సైట్‌ని చూసుకోవడానికి వెళ్లింది. సాయంత్రం 5 గంటల సమయంలో చర్చి వైపు నడుచుకుంటూ వస్తుండగా.. ఇద్దరు యువకులు చెరో బైక్ మీద ఫాలో అయ్యారు. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ఆ యువతి భయపడి రోడ్డు పక్కన దాక్కోవడానికి ప్రయత్నం చేసింది.
అయితే ఆ యువకులు ఆమెను ఆపి ఎక్కడికి వెళ్తుందో కనుక్కుని చర్చి దగ్గర డ్రాప్ చేస్తామని అన్నారు. దానికి ఆ యువతి అంగీకరించలేదు. యువకులు ఆమెను బలవంతంగా ఒక బైక్ మీద ఎక్కించుకున్నారు. ఎలక్ట్రానిక్ సిటీకి దగ్గరలో ఉన్న హస్కర్ ఏరియాలో నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఇద్దరూ కలిసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కొద్ది సేపటి తర్వాత ఆ యువతి వారి నుండి తప్పించుకుని బయటకు వచ్చిన యువతి రాత్రంతా పొదల్లో దాక్కుంది. ఆ తర్వాత దగ్గర్లో ఉన్న స్థానికుల సహాయంతో బట్టలు మార్చుకుంది.
గురువారం తెల్లవారుజామున ఆ యువతి వివేక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. యువకులపై కిడ్నాప్, గ్యాంగ్ రేప్ కేసులు నమోదు చేశారు పోలీసులు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు బళ్లారికి చెందిన అఖిలేష్ జి(25) కాగా.. మరొకరు హాసన్‌కి చెందిన దీపు జేఎల్(21)గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ ఈజీపురలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
#Bengaluru : The Vivekanagar police have arrested two men who gang-raped a women by making her drink alcohol.
The Arrested cab drivers Deepu and Akhilesh have committed the gang rape.(1/2) #Karnataka pic.twitter.com/S5hSZyd1s5
— Hate Watch Karnataka. (@Hatewatchkarnat) September 2, 2022