Karnataka: ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యాపారి కొడుకుని కిడ్నాప్ చేసిందో మహిళ. తన గ్యాంగ్ సహాయంతో అతడ్ని కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడింది. డబ్బులు డిమాండ్ చేసింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రవి ఇండస్ట్రియల్ సప్లై యజమాని రవి కుమారుడు సూరజ్. అతడు తండ్రికి వ్యాపారంలో తోడుగా ఉంటున్నాడు. సూరజ్‌కు కొద్దిరోజుల క్రితం పుష్ప అనే ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. తాను ఓ ఐఏఎస్ ఆఫీసర్ పీఎ నంటూ ఆమె అతడితో పరిచయం చేసుకుంది. ఓ నాలుగు రోజులు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
ఓ రోజు మాటల సందర్భంగా.. నేను మీకు ప్రభుత్వ టెండర్ ఇప్పిస్తాను అని ఆమె అంది. సూరజ్ ఆమెను గుడ్డిగా నమ్మాడు. ఆమెను నమ్మి ఒంటరిగా వెళ్లిన అతడ్ని తన గ్యాంగ్‌తో కిడ్నాప్ చేయించింది పుష్ప. విడుదల చేయాలంటే నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. తన దగ్గర అంత డబ్బు లేదని, ఇంట్లో కూడా అంత డబ్బులేదని సూరజ్ చెప్పాడు. ఆ తర్వాత తన స్నేహితుడు గురుమూర్తికి ఫోన్ చేసి డబ్బులు తీసుకురమ్మన్నాడు. గురుమూర్తి 25 లక్షల డబ్బులతో సంతోష్ చెప్పిన చోటుకు వెళ్లాడు. అయితే, అక్కడ సంతోషం కనిపించకపోవటంతో డబ్బులు పుష్పకు ఇవ్వకుండానే తిరిగివెళ్లిపోయాడు.
ఆ తర్వాత సూరజ్‌ను పుష్ప తన ఇంటికి తీసుకెళ్లింది. డబ్బులు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని అతడ్ని బెదిరించింది. మరో సారి గురుమూర్తి ఆమెకు ఫోన్ చేశాడు. ఇంటి అడ్రస్ చెప్పింది. పుష్ప ఇంటికి వెళ్లిన గురుమూర్తి 25 లక్షల డబ్బులు ఇచ్చేసి, అక్కడినుంచి వెళ్లిపోయాడు. పుష్ప రాత్రి 9 గంటల సమయంలో సూరజ్‌ను విడిచిపెట్టింది. ఈ సంగతి ఎవరికైనా చెబితే రేప్ కేసు పెట్టడమే కాదు.. కుటుంబాన్ని మొత్తం చంపేస్తానని సూరజ్‌ను బెదిరించింది. ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ, కిడ్నాప్ ఘటన బయటికి పొక్కిపోయింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.