ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం దొంగతనాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్తే చాలు.. వచ్చే సరికి ఇల్లుగుళ్ల చేస్తున్నారు.
ఈ మద్య ఈజీ మనీ కోసం కొంత మంది కేటుగాళ్ళు చైన్ స్నాచింగ్స్, దొంగతనాలతో హడలెత్తిస్తున్నారు. మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక వేసవి కాలంలో పిల్లలకు సెలవులు రావడంతో తమ సొంత ఊళ్లకు వెళ్తుంటారు.. తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసుకుని ఊరెళ్ళడమే పాపం.. రాత్రుళ్ళు ఇళ్లలో చొరబడి మొత్తం ఊడ్చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ నటి ఇంట్లో దొంగలు పడి బంగారం, డబ్బు దోచుకుపోయారు. వివరాల్లోకి వెళితే..
ఈ మద్య దొంగలు సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేకుండా ఇళ్లకు తాళాలు వేస్తే చాలు మెల్లిగా దూరి అందినంత దోచేస్తున్నారు. దొంగలు తాము దోచే ఇళ్లు చిన్నోళ్లవా.. పెద్దోళ్లవా అనే తేడా చూడరు.. తాము ఎంత సొమ్ము దోచుకున్నామనేదే లెక్క. ఇటీవల కొంతమంది దొంగలు రాజకీయ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన వారి ఇళ్లకు కన్నాలు వేసిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ప్రముఖ టీవీ నటి సుమిత్రా పంపన ఫ్లాట్ లో దొంగలు పడి బంగారం, వజ్రాభరణాలు దోచుకుని వెళ్లారు. ఏప్రిల్ 18 మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
టీవీ సీరియల్స్, పలు మూవీస్ లో నటించిన సుమిత్రా పంపన ఏప్రిల్ 18 న ఢిల్లీకి వెళ్లింది. ఫ్లాట్ కి తాళం వేసిన విషయం దొంగలు గమనించి ఇంట్లో చొరబడి 1.2 కిలోల బంగారం, 293 గ్రాముల వెండి, వ్రజాభరణాలు చోరీ చేశారు. సుమిత్ర తన ఫ్లాక్ కు తాళం వేసి అదే అపార్ట్ మెంట్ లో కాంప్లెక్స్ లో ఉంటున్న తన కోడలికి ఇచ్చింది. మంగళవారం ఫ్లాట్ మెయిన్ డోర్ గొళ్లం పగులగొట్టి ఉండటం సుమిత్ర కోడలు గమనించడంతో సోదరుడు విజయ్ కుమార్ కి సమాచారం ఇవ్వడంతో అతడు నేరం జరిగిన మొత్తం ఫోటోలు, వీడియో తీశాడు. హైదరాబాద్ వచ్చిన సుమిత్రాకు జరిగిన విషయం చెప్పడంతో ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చోరీ ఒకరు లేదా ఇద్దరు పక్కా ప్లాన్ తో చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 457, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.