BSC Student: ఎంత పెద్ద పెద్ద చదువులు చదివినా కొంతమంది మాత్రం చదువురాని మూర్జుల్లా ఆలోచిస్తున్నారు. 21వ శతాబ్ధంలోనూ మూఢనమ్మకాల పేరిట ప్రాణాలు తీయటమో.. తీసుకోవటమో చేస్తున్నారు. తాజాగా, ఓ యువతి తనకు శాపం ఉందంటూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. తండ్రి సకాలంలో స్పందించటంతో ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఓ యువతి బీఎస్సీ చదువుతోంది. కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌లో ఓ లేఖను షేర్ చేసింది. ఆ లేఖలో.. తనకు శాపం ఉందని, ఆ శాపం కారణంగా తన నీడపడినవారు చనిపోతారని పేర్కొంది. శాపం పోవడానికి పూజలు చేయించినా లాభం లేకపోయిందని తెలిపింది.
తన నీడ పడి తల్లిదండ్రులు, తమ్ముడు చనిపోకూడదనే ఉద్ధేశ్యంతో తాను చనిపోతున్నానంటూ రాసుకొచ్చింది. వాట్సాప్‌లో ఆ లేఖ చూసిన తండ్రి చావుబతుకుల మధ్య ఉన్న కుమార్తెను కాపాడాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ బాలుడు తనకు గతజన్మ గుర్తుకు వచ్చిందని, గత జన్మలోని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోతున్నానని సెల్ఫీ వీడియో తీసుకుని మాయమ్యాడు. మరి, యువతి శాపం ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Crime News: సొంత చెల్లెళ్లపై అన్న అత్యాచారం.. అడ్డొచ్చిన తల్లిని కూడా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.