తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు కలచివేస్తున్నాయి. ఏ క్షణంలో గుండెపోటుతో చనిపోతామో అన్న భయం ప్రజలకు పట్టుకుంది. గత రెండు నెలల నుంచి ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణ వార్తలు వస్తూనే ఉన్నాయి. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా.. ఉన్నచోటే కుప్పకూలిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ గుండెపోటు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అసలే కరోనా మహమ్మారితో ఇప్పటి వరుకు కోలుకోలేదు.. ఇప్పుడు కొత్తగా గుండెపోటు మరణాలతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ మద్యకాలంలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వరుసగా గుండెపోటుతో మరణిస్తున్నారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వారు.. అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించేలోగా చనిపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో బీఆర్ఎస్ నేత కన్నుమూశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
జిగిత్యాల జిల్లా గాంధీ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిపించేందుకు పార్టీ శ్రేణులు సిద్దమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ కవిత హాజరు కావాల్సి ఉంది. అంతా సిద్దమైన ఆనందంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మొదలవుతున్న సమయంలో ఊహించని విషాదం చోటు చేసుకుంది. తెలుగు తల్లి విగ్రహం ముందు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ చేస్తున్న బీఆర్ఎస్ కౌన్సిర్ భర్త బండారు నరేందర్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయి చనిపోయారు. దీంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో విషాదం చోటు చేసుకుంది.
ఈ రోజు శనివారం ఉదయం జగిత్యాల జిల్లా గాంధీ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించాలని పార్టీ శ్రేణులు అంతా సిద్దం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఎంతో ఆనందోత్సాహల మధ్య డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్ బండారు రజిని భర్త బండారి నరేందర్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపాయారు. ఇది గమనించిన కార్యకర్తలు ఆయకు సీపీఆర్ చేశారు.. కానీ ఫలితం కనిపించలేదు.. వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.. చికిత్స పొందుతూ సురేందర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదిలా ఉంటే నరేందర్ కన్నమూసిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ కవిత ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె పర్యటన రద్దు చేసుకున్నారు. శనివారం జరగాల్సిన ఆత్మీయ సమ్మేళనంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.