Crime News: తెలిసీ తెలియని తనంలో కలిగిన అకర్షణ ఓ యువతీ, యువకుడి జీవితాన్ని నాశనం చేసింది. ఈ ఇద్దరూ వావి వరసలు మర్చిపోయి ప్రేమలో పడ్డారు. అంతటితో ఆగకుండా శారీరకంగా కలిశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల కారణంగా యువతి చనిపోయింది. యువకుడు జైలు పాలు కావాల్సిన పరిస్థితి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, రామ్ పూర్ జిల్లాలోని గుహ్లియా ఏరియాకు చెందిన రవి అనే వ్యక్తి గడైయా పజాబా పోలీస్ట్ స్టేషన్ పరిధికి చెందిన రాజేశ్వరి ఒకరినొకరు ప్రేమించుకున్నారు.
అయితే, వీరిద్దరూ వరసకు అన్నాచెల్లెళ్లు అవుతారు. ఈ విషయం తెలిసి కూడా ఇద్దరూ ప్రేమలో పడ్డారు. మూడేళ్లలో ఆ ప్రేమ బాగా ముదిరింది. దీంతో ఇద్దరూ శారీరకంగా కలిశారు. రాజేశ్వరి గర్బవతి అయ్యింది. ఇదే విషయాన్ని రాజేశ్వరి, రవికి చెప్పింది. పెళ్లి చేసుకోమని అడిగింది. ఇందుకు అతడు అంగీకరించలేదు. అయితే, రాజేశ్వరి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. తన మనసులోనే దాచుకుంది. ఎనిమిది నెలల తర్వాత ఆమె తల్లికి ఈ విషయం తెలిసింది. ఆమె కూతుర్ని నిలదీసింది. రాజేశ్వరి జరిగినదంతా పూస గుచ్చినట్లు తల్లికి చెప్పింది.
ఆ తర్వాత ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని ఓ నిశ్చయానికి వచ్చారు. ఇద్దరికీ పెళ్లి చేశారు. కానీ, పెళ్లైన మూడు గంటల్లోపే రాజేశ్వరి చనిపోయింది. తమ కూతురు చనిపోవటానికి కూతురి భర్త, మామ తో పాటు మరో వ్యక్తి కారణం అంటూ రాజేశ్వరి తండ్రి సత్యపాల్ గంగవార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.