దేశంలో మహిళలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై దాడులకు సంబంధించి పదుల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. మృగాలు చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎవరినీ వదలడం లేదు. నిర్భయలాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. వీరిలో ఏమాత్రం మార్పురావడం లేదు. కొంత మంది దుర్మార్గులు.. విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులను కూడా వదలడం లేదు.
ఇలాంటి ఘటనలతో మన దేశ ప్రతిష్టత దెబ్బతిస్తున్నారు. గోవా బీచ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ బ్రిటీష్ మహిళపై కన్నేసిన వ్యక్తి ఆమెను తన భర్త ముందే అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
ఇది కూడా చదవండి: China: కంపెనీ బంపరాఫర్: పిల్లల్ని కంటే లక్షల్లో బోనస్.. ఏడాది పాటు సెలవులు!
గోవా అంటే పర్యాటకులకు స్వర్గధామం అంటారు. ఇక్కడ అందమైన ప్రదేశాలను తిలకించడానికి విదేశాల నుంచి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు. ఈ క్రమంలోనే బ్రిటన్ కి చెందిన భార్యాభర్తలు వచ్చారు. గోవాలో వివిధ ప్రదేశాలను చూపించడానికి టూరిస్ట్ గైడ్ గా విన్సెంట్ డిసౌజా వ్యక్తిని మాట్లాడుకున్నారు. అతని కళ్లు బ్రిటీష్ మహిళపై పడింది. మసాజ్ చేస్తున్న సమయంలో భర్త కళ్ల ముందే ఆమెపై అకృత్యానికి ఒడిగట్టాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Aadhi Pinisetty: ఆది పినిశెట్టి పెళ్లి వేడుకలో హీరో నాని సందడి! వీడియో వైరల్!
ఈ ఘటన అనంతరం బాధితురాలు ఇక్కడ ఉన్న బ్రిటిష్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరిన తర్వాత బాధితురాలు పెర్నెమ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగగారు. నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. గతంలో డిసౌజా ఓ పాఠశాలలో లైబ్రేరియన్‌గా కూడా పనిచేశాడని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఇలాంటి ఘటనలు భారయతీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతాయని నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.