Bride Srujana: పెళ్లి పీటలపై విశాఖ వధువు సృజన మృతికి సంబంధించి అసలు కారణాలు మిస్టరీగానే మిగిలాయి. ఆమె మరణానికి విష పదార్థం కారణమని, ఆమె ఒంట్లో విషం అవశేషాలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి పోస్టుమార్టం రిపోర్టు నివేదిక ఇంకా బయటకు రాలేదు. అయితే, పోలీసుల విచారణలో సృజనకు పెళ్లి ఇష్టం లేదని తేలింది. దీంతో సృజన ఇష్టంలేని పెళ్లి మూలంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సృజన మృతిపై ఆమె సోదరుడు విజయ్ స్పందించాడు. తన సోదరికి ఎలాంటి లవ్ ఎఫైర్స్ లేవని తెలిపాడు. ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయని, ఫంక్షన్ కారణంగా డేట్ రాకుండా ట్యాబ్లెట్స్ వాడిందని చెప్పాడు. పెళ్లి రోజు రెండవసారి అస్వస్థతకు గురవటంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని, ఇంతలోనే మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశాడు. పెళ్లి కొడుకు తమకు బంధువు అవుతాడని చెప్పాడు. అతడు టీడీపీ వ్యక్తి అవటంతో ఈ మరణాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డాడు.
మరో వైపు సృజన తల్లిదండ్రుల ప్రవర్తనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ నిమిత్తం పోలీసులు సృజన మొబైల్ ఫోన్‌ను అడగగా ఆమె తల్లిదండ్రులు ఆలస్యం చేశారు. గట్టిగా అడిగేంతవరకు ఇవ్వలేదు. అంతేకాదు! మొబైల్‌లోని మెసేజ్‌లు, వాట్సాప్ చాట్, మెయిల్స్ డిలీట్ చేసి.. ఆ తర్వాత ఫోన్‌ను పోలీసులకు ఇచ్చారు. దీంతో పోలీసులు డేటా రీట్రీవ్ చేసే పనిలో పడ్డారు. కేసు దర్యాప్తులో సహకరించాల్సిందిగా సృజన తల్లిదండ్రులను కోరుతున్నారు. మరి, సృజన మృతికి లవ్ ఎఫైర్ కారణం కాదంటున్న విజయ్ స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bride Srujana: విశాఖ వధువు సృజన పెళ్లి ఇష్టం లేక గన్నేరు పప్పు తినిందా?