నేటికాలం పెళ్లిళ్ల విషయాల్లో ఎప్పుడు ఏమి జరుతుందో ఊహించలేము. అంతా సవ్యంగా జరుగుతుందని అందరూ భావించే సమయానికి వధువరుల్లో ఎవరో ఒకరు అనుకోని ట్విస్ట్ ఇస్తున్నారు. వారిచ్చే షాకులకు అవాక్కవ్వడం మిగిలిన వారి వంతు అవుతోంది. తాజాగా ఓ యువతి.. తను అనాథనని చెప్పి.. ఓ వ్యక్తితో పెళ్లికి సిద్ధమైంది. తీరా పెళ్లి సమయానికి బంగారం, డబ్బులతో ఉడాయించి.. పెళ్లికొడుకుకి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. తాజాగా ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల ప్రకారం..
ఇది కూడా చదవండి : అత్త సూటిపోటి మాటలు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రేణు అలియాస్ సంగీత అహిర్వార్ అనే యువతి తన మేనత్త అర్చన అహిర్వార్ తో కలిసి నివసిస్తుంది. సియోని ప్రాంతానికి చెందిన దశరథ్ సింగ్ రాజ్‌పుత్ అనే వ్యక్తి తో తనను అనాథగా పరిచయం చేసుకుంది రేణు. మేనత్తతో పాటు ఉంటున్నానని తెలిపింది. ఆమె మాటలు నమ్మిన సింగ్ స్నేహం చేశాడు. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి వివాహం జిల్లా కోర్టులో ఆవరణంలో ఉన్న ఓ ఆలయంలో జరిపించాలని పెద్దల నిర్ణయించారు. ఈక్రమంలో కొంత బంగారం డబ్బులు సమకూర్చారు దశరథ్ కుటుంబ సభ్యులు. వివాహం రోజున పెళ్లి కూతురు రేణు.. తన మేనత్త అర్చనతో కలసి వరుడు దశరథ్ సింగ్ కారులో ఆలయానికి బయలుదేరారు. కొద్ది సమయానికి పెళ్లి కూతురు కారులో తనకు అసౌకర్యంగా ఉందని చెప్పి దిగింది.
కారుకు సమీపంలో ఉన్న ఓ వ్యక్తి బైక్ పై ఆమె పరారయ్యింది. వధువు పారిపోయిందనే విషయం తెలియగానే ఆమె మేనత్తను నిర్భంధించారు పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు. పెళ్లి నాటకమాడిన రేణు మొత్తం 2.5 లక్షల విలువైన బంగారు నగలు, రూ.50 వేల రూపాయల నగదుతో పరారయ్యినట్టు బాధితులు ఒమాటి సర్కిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సదరు మహిళను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పెళ్లి కూతురుని బైక్ పై తీసుకెళ్లిన వ్యక్తి ఆమె ప్రియుడే అని తెలింది. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు.. అనాథ కదా అని పెళ్లి చేసుకుని జీవితం ఇద్దామనుకున్న అతనినే మోసం చేసింది ఆ మాయలేడి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.