ఓ స్టూడెంట్ క్లాస్ రూమ్ లోనే దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఒంటరిగా ఉండడం చూసిన ఆ బాలుడు కత్తితో ఆమెపై పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన మరికొందరు టీచర్లు.. ఆ బాలుడి చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకన్నారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు.
పిల్లలు చదువులో బాగా రాణించి మంచి మార్కులతో పాస్ కావాలని ప్రతీ ఉపాధ్యాయుడు కృషి చేస్తుంటారు. అవసరమైతే అప్పుడప్పడు మందలించి కూడా పిల్లలకు చదువు చెబుతుంటారు. ఇక టీచర్ కోపంతో చెప్పడంతో స్టూడెంట్స్.. ఉపాధ్యాయులపై కోపంతో ఊగిపోతుంటారు. ఇంకొందరైతే.. ఎలాగైన టీచర్ పై పగ తీర్చుకోవాలని అనుకుంటుంటారు. అచ్చం ఇలాగే ఆలోచించాడో స్టూడెంట్. ఏకంగా క్లాస్ రూమ్ లోనే కత్తితో టీచర్ పై విచక్షణారహితంగా పలుమార్లు పొడిచి పగ తీర్చుకున్నాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
బ్రెజిల్ లో అతి పెద్ద నగరం సావోపాలో. ఇక్కడే ఓ ప్రాంతంలో ఉన్న ఓ పబ్లిక్ స్కూల్ లో 71 ఏళ్ల మహిళ టీచర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదే స్కూల్ లో 17 ఏళ్ల స్టూడెంట్ చదువుకుంటున్నాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మొత్తానికి ఆ బాలుడు టీచర్ పై ఎలాగైన పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇక ఆ బాలుడు పథకం ప్రకారమే ఇటీవల స్కూల్ కు వస్తూ తన బ్యాగులో కత్తి తెచ్చుకున్నాడు. క్లాస్ రూమ్ లో టీచర్ ఒంటరిగా ఉండడం చూసిన ఆ బాలుడు.. బ్యాగులో ఉన్న కత్తితో ఆ టీచర్ పై పలుమార్లు పొడిచాడు. ఆ ఉపాధ్యాయురాలు అరుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయినా వదలని ఆ బాలుడు.. అలాగే ఆ టీచర్ పై దాడి చేశాడు. ఆ టీచర్ అరుపులు విన్న తోటి ఉపాధ్యాయులు పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని పట్టుకుని అతని చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది టీచర్లు, స్కూడెంట్స్ ను సైతం అతడు గాయపరిచినట్లుగా తెలుస్తోంది. ఇదంతా క్లాస్ రూమ్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ టీచర్ ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. క్లాస్ రూమ్ లోనే టీచర్ ను కత్తితో పోడిచిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 29, 2023