ఈ మధ్యకాలంలో ప్రతీ సమస్యకు ఆత్మహత్యే పరిష్కారమని భావించి బతకలేని కొందరు యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రేమలో విఫలమైన, అనుకున్నది సాధించలేకపోయినా ఇలా అనేక సమస్యలతో సూసైడ్ చేసుకుంటూ నిండు జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. ఇలాగే చేసుకోబోయింది ఓ యువతి. రైల్వే ట్రాక్ గేట్ సమీపంలో అటు నుంచి వేగంతో ట్రైన్ దూసుకొస్తుంది. దీంతో అలెర్ట్ అయిన రైల్వేవర్కర్ వాహనాలు వెళ్లకుండా గేట్ వేశాడు.
దీంతో అటు నుంచి వాహనాలన్నీ ఆగిపోయాయి. దీంతో ఓ యువతి అక్కడికి చేరుకుంది. ట్రైన్ కూడా వేగంతో వస్తుంది. ఇక సూసైడ్ చేసుకోవాలని భావించిన ఆ యువతి మెల్ల మెల్లగా రైల్వే ట్రాక్ పైకి వెళ్లి ఏడుస్తూ నిలబడింది. దీంతో గమనించిన కొందరు యువకులు పరుగెత్తికెళ్లి ఆ యువతి ప్రాణాలను కాపాడారు. ఇక పక్కనున్న వాళ్లంత ఎవరు నువ్వు? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావంటూ కాసేపు ఓదార్చే ప్రయత్నం చేశారు.
ఇదే దృశ్యాన్ని అక్కడున్న కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయటంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఇక తెగువతో ఆ యువతిని కాపాడిని ఆ యువకుడి సాహసానికి అందరూ అభినందిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.