ఈ మధ్యకాలంలో స్కూల్ వయసు నుంచే ప్రేమ అంటూ జాలీగా తిరుగుతున్నారు కొందరు బాల బాలికలు. కొన్నాళ్ల పాటు పార్క్ లు, రెస్టారెంట్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తూ రంగుల ప్రపంచంలోకి అడుగులు వేస్తున్నారు. కొన్నాళ్లకు ఇద్దరి మధ్య గొడవలు తలెత్తటంతో విడిపోవటం, లేదంటే హత్యలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బిహార్ రాష్ట్రంలోని గోపాల్ గంజి జిల్లా, మధు సారియా గ్రామానికి చెందిన రాజ్‌దూత్ అనే యువకుడు పక్కింట్లో ఉండే కవితకుమారి(20) అనే యువతితో ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు ఇద్దరూ కలిసి తిరిగటంతో పాటు శారీరకంగా కూడా కలుసుకున్నారు. అయితే ఈ నేపథ్యంతో ఆ యువతి గర్భం దాల్చింది. ఇక భయంతో ఇదే విషయాన్ని కవితకుమారి ప్రియుడికి చెప్పి ఎక్కడికైన తీసుకెళ్లాలంటూ కోరింది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రియుడు చిత్తూరుకు తీసుకొచ్చాడు.
అక్టోబర్ 11న చిత్తూరులోని ఓ సెల్‌ఫోన్ షాపులో మొబైల్ రిపేర్ చేసుకుని కలవగుంట పంచాయతీ విజయనగరం యానాదికాలనీలో ఇద్దరు కలిసి ఓ ఇంట్లో అద్దెకు దిగారు. దీంతో ఎలాగైన ప్రియురాలిని అబార్షన్ కి ఒప్పించేందుకు ప్రయత్నాలు చేశాడు. అయితే దీనికి కవితకుమారి నిరాకరించటంతో ప్రియుడు లోలోపల కాస్త కోపంతో రగిలిపోయాడు. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కాస్త వివాదం కూడా రగిలింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన రాజ్‌దూత్ ప్రియురాలి ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.
ఇక అస్సలు కూడా అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో యువతి దుస్తువులతో పాటు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంట్లోనే యువతి శవాన్ని ఉంచి పారిపోయాడు. ఇక కొన్నాళ్లకి ఆ ఇంట్లోంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కింద కేసు నమోదు చేసుకున్నారు. ఇక విచారణలో భాగంగా సెల్‌ఫోన్ మొబైల్ రిపేర్ చేసుకున్న షాపులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.