ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. రోడ్లపై వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి.. చోరీలకు పాల్పడుతున్నారు. మహిళల నుంచి సొమ్ము కొట్టేసే సమయంలో వారిపై దాడులకు సైతం తెగబడుతున్నారు. ఇటీవల ఢిల్లీలోని షాలిమార్‌బాగ్ ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి మహిళ మొబైల్ ఫోన్ లాక్కునే ప్రయత్నంలో.. బాధితురాలిని వంద మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లాడు. దీంతో సదరు మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మరోసారి అదే ఢిల్లీ లో దొంగలు రెచ్చిపోయారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు దొంగలు.. మహిళపై దాడి చేసి మరి బ్యాగ్‌ను ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే..
దక్షిణ ఢిల్లీలోని శ్రీనగర్ లో ఉండే షాహిదా బజాజ్ (46) అనే మహిళ భర్త కలిసి హోటల్‌లో పనిచేస్తోంది. జూలై 30న గ్రేటర్ కైలాష్-1 ఎమ్ బ్లాక్ మార్కెట్ ప్రాంతంలో భర్తతో కలిసి హోటల్‌కు వెళ్లి తిరిగి వస్తుంది. ఇదే సమయంలో ఆ దంపతులను గమనించిన దొంగలు.. బైక్ పై అనుసరించారు. కొంత దూరం వెళ్లిన తరువాత బైక్‌పై వచ్చిన ఆ దుండగులు మహిళపై దాడి చేసి అమాంతం బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఈక్రమంలో మెడలో బ్యాగ్ ఉండటంతో సదరు మహిళ రోడ్డుపై పడిపోయింది. దీంతో మహిళకు గాయలయ్యాయి.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో ఫుటేజీలో.. రద్దీగా ఉన్న మార్కెట్లో బైక్‌పై వచ్చిన నిందితుల్లో వెనుక కూర్చున్న వ్యక్తి ఆమె బ్యాగ్‌ను గట్టిగా లాగాడు. దీంతో ఆమె రోడ్డుపై పడిపోవడం అందులో కనిపిస్తుంది. ఆమె భర్త, మరొకరు ఆమెను రక్షించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు.. గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దొంగల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Video | Bikers Snatch Woman’s Bag In Posh Delhi Market, Leave Her Injured https://t.co/T9l0tpR05m pic.twitter.com/GAL0BdY2E7
— NDTV (@ndtv) August 17, 2022