Crime News: మామ వరసయ్యే వ్యక్తితో ప్రేమలో పడిందో యువతి. భర్తను, ఇద్దరు పిల్లల్ని కాదని అతడితో పాటు పారిపోయింది. దీంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో ఆసల్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, పార్సా బజార్ పోలీస్ స్టేషన్ పరిథిలోని కుర్తౌల్ గ్రామానికి చెందిన కుందన్ సింగ్ అనే వ్యక్తి గురువారం పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. ‘ సార్! నా భార్య మామ వరసయ్యే జశ్వంత్ సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. అతడికి దూరంగా ఉండాలని నేను గట్టిగా చెప్పాను. వినలేదు సరికదా.. ఇద్దరూ కలిసి నాపైనే బెదిరింపులకు దిగారు. మూడు రోజుల క్రితం నన్ను, నా ఇద్దరు పిల్లల్ని వదిలేసి అతడితో లేచిపోయింది’’ అని ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు చేసిన తర్వాత కుందన్ ఇంటికి వచ్చేశాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. దీంతో అతడ్ని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. కాగా, కుర్తౌల్ గ్రామానికి చెందిన జశ్వంత్ సింగ్, కుందన్‌కు దూరపు చుట్టం. వారి ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే జశ్వంత్ మాటలకు, చేష్టలకు కుందన్ భార్య ఆకర్షితురాలయింది. ఇక ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ఏకాంతంగా కూడా కలిసేవారు. కొన్ని రోజుల తర్వాత ఈ విషయం కుందన్‌కు తెలిసింది.
ఆ కొద్ది కాలానికే ఊరు మొత్తం పాకిపోయింది. ఊరు ఊరు మొత్తం కుందన్ భార్య, జశ్వంత్‌ల వివాహేతర సంబంధం గురించే మాట్లాడుకోవటం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు. భార్య తనను, ఇద్దరు పిల్లల్ని వదిలేసి పోవటం, ఊరు మొత్తం తన భార్య గురించి మాట్లాడుతూ దెప్పిపొడుస్తారన్న బాధతో కుందన్ ఆత్మహత్య చేసుకున్నాడు. కుందన్ ఆత్మహత్యపై కూడా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పారిపోయిన ఇద్దరి కోసం అన్వేషిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Jharkhand: వీడియో: గిరిజన బాలికపై దారుణానికి ఒడిగట్టిన యువకుడు.. విషయం సీఎంకి తెలిసింది!