Crime News: తాచెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అని.. తప్పు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్నా ఓ ఖైదీ తన బుద్ది మార్చుకోలేదు. ఇంత జరిగింది కదా ఇకనుంచైనా మారదాం అని అనుకోలేదు. నేను చెడ్డాను అందరూ చెడాల్సిందే అనుకున్నాడు కాబోలు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు వార్డులోని కొంతమంది సిబ్బందిని కూడా మార్చేశాడు. తప్పుడు పనులు చేసేలా చేసి వారిని కూడా జైలు పాలు చేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, వైశాలికి చెందిన ఓ వ్యక్తి ఓ కేసు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగోలేకపోవటంతో అక్కడి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఆసుపత్రి వైద్యులు అతడ్ని ఖైదీల వార్డులో ఉంచారు. ఈ నేపథ్యంలోనే అతడికి ఓ పాడు ఆలోచన పుట్టింది. వార్డులోని బాయ్స్‌కు తన ఆలోచనను చెప్పాడు. వారిని ఒప్పించాడు. ఆ తర్వాత తన పథకం ప్రకారం కొంతమంది కాల్ గర్ల్స్‌ను అక్కడికి రప్పించేవాడు. తరచుగా వారితో తన కోర్కెలు తీర్చుకునేవాడు. అతడితో పాటు అక్కడ పని చేసే కొంత మంది వార్డు బాయ్‌లు కూడా కాల్ గర్ల్స్‌తో తమ కోర్కెల్ని తీర్చుకునేవారు. కొద్దిరోజుల క్రితం వేరే రాష్ట్రం నుంచి ఓ కాల్ గర్ల్‌ను రప్పించాడు. ఆమెతో తన కోర్కెలు తీర్చుకుంటూ ఉండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు.
ఆ వెంటనే అతడితో పాటు కాల్ గర్ల్, వార్డ్ బాయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీసులు సరిగ్గా అదే సమయానికి వార్డులోకి రావటం యాదృచ్ఛికంగా జరిగింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ ఓ ఫోన్ దొంగతనం కేసు దర్యాప్తు చేస్తున్నారు. లోకేషన్ ఆధారంగా ఆ ఫోన్‌ను ట్రేస్ చేసుకుంటూ వెళుతున్నారు. ఆ ఫోన్ లొకేషన్ ఆసుపత్రిలో చూపించింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. అదే సమయంలో సదరు ఖైదీ, కాల్ గర్ల్‌తో ఏకాంతంగా ఉండటం చూసి అరెస్ట్ చేశారు.