సమాజంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని చిన్నారులు.. దారుణాతి దారుణమైన నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
మన చుట్టూ చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. అసలు మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో.. అర్థంకాక భయమేస్తుంది. మన ఇంట్లో మనకు రక్షణ లేని పరిస్థితులు. అడుగడుగునా నేరాలే కనిపిస్తున్నాయి. మరో దారుణమైన అంశం ఏంటంటే.. పట్టుమని పదేళ్లు కూడా లేని చిన్నారుల్లో సైతం వెన్నులో వణుకు పుట్టించే స్థాయిలో క్రూరత్వం కనిపిస్తోంది. అసలు చిన్నారులు ఏంటి.. వారిలో ఈ స్థాయి క్రూరత్వం ఏంటో అర్థం కాకుండా పోతుంది. తాజాగా ఓ దారుణాతి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పట్టుమని 10 ఏళ్ల వయసు కూడా లేని చిన్నారి.. 13 ఏళ్ల తన అక్క చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యింది. 9 ఏళ్ల చిన్నారికి నరకం అంటే ఏంటో చూపించింది ఆ అక్క. చిన్నారిని హత్య చేసి.. కాళ్లు చేతులు నరికి.. మొహంపై యాసిడ్ పోసి.. కరుడుకట్టిన నేరస్థులు ఎలా ప్రవర్తిస్తారో.. ఇక్కడ మృతురాలి సోదరి కూడా అలానే ప్రవర్తించింది. మరి 13 ఏళ్ల బాలిక.. ఇంత దారుణానికి ఎందుకు పాల్పడింది అంటే..
ఈ దారుణం బిహార్, వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. 9 ఏళ్ల తన కుమార్తె కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రులు. గాలింపు చేపట్టగా.. ఇంటి వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలో.. అత్యంత దారుణ స్థితిలో.. గుర్తు పట్టడానికి వీలు లేకుండా ఉన్న స్థితిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. ముద్దులొలికే మాటలతో.. చెంగు చెంగున ఎగురుతూ తిరిగే చిట్టి తల్లి.. ఇంత దారుణ స్థితిలో కనిపించే సరికి.. ఆమె తల్లిదండ్రులు గుండె ఆగిపోయినంత పని అయ్యింది. గుర్తు పట్టరాకుండా ఉన్న బిడ్డ మృతదేహాన్ని చూసి.. ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. పట్టుమని 10 ఏళ్లు కూడా లేని చిన్నారి మీద ఎవరికి ఇంత కక్ష ఉంది.. ఎందుకు ఇంత దారుణంగా హత్య చేశారు అన్న దాని గురించి ఆలోచించసాగారు పోలీసులు.
ఈ కేసు దర్యాప్తు చేస్తుండగా.. చిన్నారి అక్క ప్రవర్తన మీద పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమె మీద నిఘా వేశారు. ఆమె కాల్ డేటాను పరిశీలించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు ఆమెను తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను 18 ఏళ్ల యువకుడిని ప్రేమించానని తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 15 న తల్లిదండ్రులు వేరే ఊరిలో వివాహం ఉందని వెళ్లారు. ఆడపిల్లలు ఇద్దరు మాత్రమే ఇంట్లో ఉన్నారు.
తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో.. మృతిరాలి అక్క.. తన బాయ్‌ఫ్రెండ్‌ని ఇంటికి పిలిపించుకుంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా.. మృతురాలి వారిని చూసింది. దాంతో భయపడిపోయిన నిందితులు.. తమ గురించి తల్లిదండ్రులకు చెప్తుందని భావించి.. 9 ఏళ్ల చెల్లిని బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హత్య చేసింది 13 ఏళ్ల అక్క. నిందితురాలి మేనత్త కూడా వారికి సహకరించినంది. చిన్నారిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఓ డబ్బాలో పెట్టారు. మూడు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో.. మృతదేహాన్ని ఇంటి వెనక ఉన్న ఖాళీ స్థలంలో పడేశారు. మృతురాలిని గుర్తుపట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో.. చిన్నారి ముఖం మీద యాసిడ్ పోశారు. తర్వాత చిన్నారి చాళ్లు, చేతులు తొలగించారు.
ఇంటికి వచ్చిన తల్లిండ్రులకు చిన్నారి కనిపించలేదు. దాంతో వారు సమీపంలోని జందహా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలి ఇంటి వద్ద గాలించగా.. గుర్తు పట్టరాకుండా ఉన్న 9 ఏళ్ల చిన్నారి మృత దేహం లభ్యమయ్యింది. ఈ కేసులో 13 ఏళ్ల బాలిక.. ఆమె ప్రియుడు 18 ఏళ్ల యువకుడితోపాటు 32 ఏళ్ల మేనత్తను అరెస్ట్ చేశారు పోలీసులు. 13 ఏళ్ల బాలికను జువైనల్ హోమ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దర్ని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్లు తెలిపారు. మరి ఈ దారుణ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.