love: ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు యువతుల్ని ఒకే టైంలో ప్రేమించాడో యువకుడు. ఆ ముగ్గురితో లైఫ్‌ను ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు. అయితే, కథ అడ్డం తిరిగింది. చివరకు ముగ్గురు ప్రియురాళ్ల కారణంగా ఆ యువకుడు జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. బిహార్‌కు చెందిన సత్యనారాయణ అనే ఓ యువకుడు ఒకే టైంలో ముగ్గురు యువతుల్ని ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో గడిపేవాడు. లైఫ్ మొత్తం ఎంతో సంతోషంగా గడుస్తోంది అనుకున్న సమయంలో కథ అడ్డం తిరిగింది. ముగ్గురు ప్రియురాళ్ల రూపంలో కష్టాలు మొదలయ్యాయి. ఆ యువతులు ఖరీదైన బహుమతులు కావాలని సత్యనారాయణను ఇబ్బంది పెట్టేవారు. వారి పోరు పడలేక.. ఖరీదైన కానుకలు తెచ్చి ఇచ్చే స్థోమత లేక అతడు అల్లాడిపోయేవాడు.
చివరకు ప్రియురాళ్ల కోరికలు తీర్చడానికి దొంగగా మారాడు. వారు బహుమతులు అడిగిన ప్రతీసారి దొంగతనాలు చేసేవాడు. తర్వాత దొంగతనం చేసిన వస్తువుల్ని అమ్మి వారి కోర్కెలు తీర్చేవాడు. ముఖ్యంగా లక్షల విలువ చేసే బైకులను మాత్రమే దొంగతనం చేస్తూ వస్తున్నాడు. వాటిని అతి తక్కువ ధరలకు అమ్మేవాడు. ఇలా బైకుల దొంగతనాలను చేయటానికి ఓ గ్యాంగును కూడా ఏర్పాటు చేసుకున్నాడు.
వారి సహాయంతో వరుస బైకు దొంగతనాలకు పాల్పడ్డాడు. తాజాగా, ఓ బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు ప్రియురాళ్ల కోసమే దొంగతనాలు చేస్తున్నట్లు అతడు చెప్పుకొచ్చాడు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Anakapalle: ఆమె ఉండేది చిన్న గుడిసెలో. ప్రియుడు అడిగాడని 11 లక్షలు ఇచ్చింది. కానీ.. చివరికి!