పోలీసుల నిఘా ఎంత పెరిగినా.. సీసీటీవీలు నిత్యం రికార్డు చేస్తున్నా సరే.. ఇవేవి దొంగలను ఆపలేకపోతున్నాయి. పట్టపగలు.. అందరూ చూస్తుండగానే.. దర్జాగా దోచేస్తున్నారు. చైన్ స్నాచింగ్‌లు, బ్యాంకులు, బంగారు నగల దుకాణాలు ఇలా వేటిని వదలడం లేదు. దాడి చేయడం.. అందినకాడికి దోచుకుపోవడం ఇదే జరగుతుంది. తాజాగా ఓ భారీ దొంగతనం చోటు చేసుకుంది. దొంగలు కేవలం 7 నిమిషాల వ్యవధిలోనే కోటిన్నర విలువైన సొత్తును చోరీ చేశారు. గత 30 ఏళ్లలో ఆ ప్రాంతంలో ఇదే భారీ దొంగతనమంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: స్టార్ హీరోయిన్ ఇంట చోరీ! నమ్మిన వ్యక్తే ముంచేశాడు!
బిహార్‌లోని ఛప్రా నగరంలో ఈ మంగళవారం చంప్రా నగరంలోని పీఎన్ జ్యువెల్లర్స్‌లో దొంగలు పడ్డారు. సిబ్బందిని తుపాకులతో బెదిరించి నగలను మొత్తం ఎత్తుకెళ్లారు. మొత్తం ఆరుగరు వ్యక్తులు షాపులోకి ప్రవేశించారు. వారిని గుర్తు పట్టడానికి విల్లేకుండా చేతులకు గ్లౌస్‌లు, కాళ్లకు సాక్స్‌లు, ముఖానికి మాస్క్‌లు ధరించి ఉన్నారు. ముందుగా సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి.. అతడి వద్ద ఉన్న తుపాకీని లాక్కున్నారు. అనంతరం షాపులోకి వచ్చి.. గాల్లోకి కాల్పులు జరిపారు. కదిలితే చంపేస్తామని సిబ్బందిని బెదిరించారు. అనంతరం గన్నుతో డిస్‌ప్లే బోర్డును బద్దలు కొట్టి.. అందులో ఉన్న బంగారం ఆభరణాలన్నింటినీ ఓ గోనె సంచిలో వేసుకున్నారు.
ఇది కూడా చదవండి: పబ్లిక్ టాయిలెట్ చోరీ.. GHMC ఉద్యోగి హస్తం!
అంతేకాదు సిబ్బంది మొబైల్ ఫోన్లను కూడా కట్టేశారు. ఐతే ఓ ఉద్యోగిని బిగ్గరగా ఏడవడంతో ఆమెకు ఫోన్ తిరిగిచ్చారు. కానీ ఎవరికీ కాల్ చేసేందుకు వీలు లేకుండా.. సిమ్ కార్డు తీసుకున్నారు. ఖాళీ మొబైల్ మాత్రమే అప్పగించారు. అనంతరం సిబ్బందికి టాటా బై బై చెబుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఇదంతా జస్ట్ 7 నిమిషాల్లోనే పూర్తయింది. చోరీకి గురైన సొత్తు విలువ సుమారు కోటిన్నర రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దొంగలను వెతికే ప్రయత్నంలో ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.