దేశంలో దుర్మార్గులు రెచ్చిపోతున్నారు. వావివరసలు మరిచిన కొంతమంది అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా కన్న కూతురిపై తండ్రి అత్యాచారం చేసిన ఘటన తాజాగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్ లోని రోసెరాలో ఓ వ్యక్తి భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే వృత్తిరీత్యా ఆయన ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇక విద్యాబుద్దులు నేర్పించాల్సిన తండ్రే వక్రమార్గంలోకి వెళ్లాడు.
ఇది కూడా చదవండి: Anakapalle: అర్థరాత్రి 6 ఏళ్ల బాలికపై దారుణం.. పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం!
ఇంతటితో ఆగకుండా తన 18 ఏళ్ల కూతురిపై తండ్రి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇన్నాళ్లు భరించిన కూతురు ఇక సహించలేకపోయింది. పథకం ప్రకారం తండ్రి అత్యాచారం చేస్తుండగా కూతురు సీక్రెట్ కెమెరాతో వీడియో తీసింది. దీంతో ఆ వీడియోలను అందరికీ తెలిసేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో కాస్త వైరల్ గా మారడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో వెంటనే కూతురు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇక తండ్రి దారుణంలో భార్య ఏమాత్రం కూతురికి మద్దతు పలకలేదని తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.