వివాహేతర సంబంధం.. ఇవే వైవాహిక బంధాలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అక్రమ సంబంధాల్లో తలదూర్చుతూ పచ్చని కాపురాలను నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యను కరెంట్ పోల్ కి కట్టేసి దారుణంగా కొట్టాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బీహార్ రాష్ట్రం రోహతస్ జిల్లాలోని ఓ గ్రామం. భార్యాభర్తలకు గతంలో వివాహమై ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంత కాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోయింది. అలా సాగుతున్న క్రమంలోనే భార్య పక్కచూపులు చూస్తూ పరాయి వాడికి దగ్గరైంది. భర్తను కాదని భార్య ప్రియుడితో అన్ని కోరికలు తీర్చుకుంది. ఇక కొన్నాళ్లకి భార్య చీకటి సంసారం భర్తకు తెలిసింది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య అనేకసార్లు వాగ్వాదం చోటు చేసుకుంది.
ఇది కూడా చదవండి: Jharkhand: హార్ట్ బ్రేకింగ్ న్యూస్.. నవ జాత శిశువుని పీక్కుతిన్న ఎలుకలు!
భర్త రెండు మూడు హెచ్చరించే ప్రయత్నం చేనా భార్య బుద్ది మాత్రం మారలేదు. దీంతో విసిగిపోయిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. కాగా పోలీసులు సైతం జోక్యం చేసుకుని భార్యాభర్తలకు కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. అయినా భార్య ప్రవర్తన చెక్కుచెదరలేదు. దీంతో భర్త కోపం కట్టలు తెంచుకుంది. ఇలా అయితే కాదని భావించి తన కుటుంబ సభ్యుల సాయంతో భార్యను కరెంట్ పోల్ కి కట్టేసి దారుణంగా చితకబాదాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని భర్తను అతని కుటుంబ సభ్యులను అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.