ఆమెకు పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఉపాధి నిమిత్తం ఆమె భర్త దుబాయికి వెళ్లగా.. స్థానికంగా ఉండే ఓ యువకుడితో వివాహేతర సంబంధాన్ని నడిపించింది. చివరికి ప్రియుడితో చేతులు కలిపి ఎంతకు తెగించిందంటే?
ఆమెకు పెళ్లై ఆరుగురు పిల్లలు ఉన్నారు. భర్త ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లాడు. భార్య మాత్రం ఇక్కడే ఉంటూ తన పిల్లలను చూసుకుంటూ ఉండేది. అయితే ఈ క్రమంలోనే ఆమెకు స్థానికంగా ఉండే ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది. అలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా వీరి వ్యవహారం 20 ఏళ్లుగా కొనసాగినట్లుగా తేలింది. ఇక చివరికి ప్రియుడిని దక్కించుకునేందుకు ఆ వివాహిత ఎంతకు తెగించిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ గోపాల్ గంజ్ జిల్లాలోని లాఢ్ పుర్ గ్రామం. ఇక్కడే మహమ్మద్ మియా-నూర్జహాన్ ఖాతూన్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అలా కొన్నేళ్లకు వీరికి ఆరుగురు పిల్లలు జన్మించారు. అయితే ఉపాధి నిమిత్తం గతంలో ఆమె భర్త దుబాయి వెళ్లాడు. అప్పుడప్పుడు తిరిగి ఇంటికి వస్తుండేవాడు. ఇక భార్యకు భర్త దూరంగా ఉండడంతో ఈ ఇల్లాలు నౌశద్ ఆలం అనే వ్యక్తిపై మనసుపడింది. దీనికి అతడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక ఇంకేముంది.. సమయం దొరికినప్పుడల్లా పిల్లల కళ్లు గప్పి బెడ్ రూంలో ప్రియుడితో ఎంజాయ్ చేసేది.
అయితే రాను రాను ఆమెకు భర్త కన్న ప్రియుడితోనే ఉండాలనుకుంది. ఈ క్రమంలోనే ఆమె భర్త మహమ్మద్ మియాకు భార్య చీకటి కాపురం తెలిసిపోయింది. బుద్దిమానుకుని జాగ్రత్తగా ఉండాలంటూ అనేక సార్లు హెచ్చరించాడు. ఇదే కాకుండా ఆమెను హింసించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో భార్య నూర్జహాన్ ఖాతూన్ తట్టుకోలేకపోయింది. ఆ సమయంలో ఆమెకు ఏం చేయాలో తోచలేదు. అప్పుడే ఆమెకు వచ్చిన ఐడియానే తన భర్తను ప్రాణాలతో లేకుండా చేయడం. ఇదే విషయాన్ని ప్రియుడైన నౌశద్ ఆలంకు వివరించింది. దీనికి అతడు కూడా సరే అన్నాడు. ఇక సుపారీ కింద రూ.50 వేలు ఇచ్చి ఇతరులతో హత్య చేయాలని అనుకున్నారు.
ఇందుకోసం పక్కా ప్లాన్ తో మే 22 కన్న ముందే మహమ్మద్ మియాను దుబాయి నుంచి రప్పించి హత్యకు పథకం రచించారు. ఇక అతడు దుబాయి నుంచి రాగానే చంపాలని అనుకున్నారు. ఇందులో భాగంగానే మే 22న రాత్రి మహమ్మద్ మియా బయట పడుకున్నాడు. వెంటనే అతని భార్య సుపారీ కిల్లర్లకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. వస్తూ వస్తూనే దుండగులు అతడిని హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం భార్యను విచారించగా తనకేం తెలియదన్నట్లుగా నటించింది. ఆ తర్వాత పోలీసులు ఈ కేసును కాస్త సీరియస్ గా తీసుకుని విచారించారు. అయితే పోలీసుల తాజా విచారణలో మాత్రం మహమ్మద్ మియాను ఆమె భార్య ప్రియుడితో చేతులు కలిపి సుపారీ ఇచ్చి హత్య చేసిందని తేలింది. దీంతో పోలీసులు వారి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగ మారింది.