మరి కొన్ని గంటల్లో వివాహం అనగా పెళ్లి కూతురు బ్యూటీపార్లర్ కు వెళ్లింది. ఆమె వెంటే ఓ కానిస్టేబుల్ కూడా దొంగచాటున వెళ్లాడు. ఆ యువతి బ్యూటీపార్లర్ లో లోపలికి వెళ్లగానే తుపాకీతో ఆమెను కాల్చి పరారయ్యాడు. అసలేం జరిగిందంటే?
తెల్లారితో పెళ్లి, వధువు, వరుడు కుటుంభికులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక మరి కొన్ని గంటల్లో వివాహం అనగా పెళ్లి కూతురు మేకప్ కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లింది. ఆమెతో పాటే ఆమన్ కుమార్ అనే కానిస్టేబుల్ కూడా వెళ్లాడు. లోపలికి వెళ్లి ఆ వధువు కూర్చిలో కూర్చింది. వెంటనే లోపలికి వెళ్లిన ఆ కానిస్టేబుల్ ఆ పెళ్లి కూతురిపై తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత తానూ కాల్చుకునే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూసి అక్కడున్న వారికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ ముంగేర్ లో నివాసం ఉంటున్న అపూర్వ కుమారి (26) అనే యువతికి తల్లిదండ్రులు ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. ఆదివారం పెళ్లి జరగనుంది. అయితే ఈ క్రమంలోనే శనివారం అపూర్వ కుమారి మేకప్ కోసం స్థానికంగా ఉండే ఓ బ్యూటీపార్లర్ కు వెళ్లింది. కాగా, ఆ యువతి వెంటే ఓ అమన్ కుమార్ అనే ఓ కానిస్టేబుల్ కూడా వెళ్లాడు. ఇక ఆ పెళ్లి కూతురు బ్యూటీపార్లర్ లోపలికి వెళ్లింది. తలుపులు తోసుకుంటూ ఆ కానిస్టేబుల్ కూడా ఆ యువతి వెంటే వెళ్లి అతని వద్ద ఉన్నతుపాకీతో అపూర్వ కుమారిని వెనకాల నుంచి కాల్చాడు. దీంతో బుల్లెట్ ఆమె ఎడమ భుజంలోకి దూసుకెళ్లింది.
ఆ తర్వాత తానూ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. అక్కడున్నవారు వారించడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక కొందరు స్థానికులు పెళ్లి కూతురుని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ యువతి కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ కానిస్టేబుల్ ఆ యువతిని ఎందుకు తుపాకీతో కాల్చాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలేం జరిగిందనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
]
— Hardin (@hardintessa143) May 23, 2023