చదువు చెప్పి పిల్లలను మంచి పౌరులుగా తీర్చు దిద్దాల్సిన కొందరు గురువులు కిరాతంగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొందరైతే ఏకంగా బాలికల పట్ల దారుణంగా చెడు పనులకు కాలు దువ్వుతూ లైంగిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇలా రోజుకొ చోట పిల్లలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బిహార్ లో ఓ టీచర్ 5 ఏళ్ల బాలుడి పట్ల కర్కశంగా ప్రవర్తిస్తూ విచక్షణారహితంగా కర్రతో దాడి చేశాడు. దీంతో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పట్నా పరిధిలోని వీర్ ఒరియా. ఇదే ప్రాంతంలో జయ అనే కోచింగ్ ఇన్ స్టిట్యూట్ లో ఛోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఈ మాస్టారు ఓ ఐదేళ్ల బాలుడు సరిగ్గా చదవడం లేదని అతనిపై కర్కశంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి కర్రతో దాడి చేస్తూ, కాళ్లతో తన్నాడు. బాలుడు కొట్టొద్దని కాళ్లాయేళ్ల పడ్డా అస్సలు కనికరించకుండా ఆ దుర్మార్గుడు దారుణంగా దాడికి దిగాడు.
ఇది కూడా చదవండి: Mahabub Nagar: 8 ఏళ్లుగా ప్రేమించుకున్నారు.. పెళ్లై ఐదు రోజులు కాపురం చేశాడు, అంతలోనే!
ఈ దాడిలో ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే సమాచారం అందుకున్న ఆ బాలుడి తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం టీచర్ ఛోటుపై బాదితుడి బంధువులు చితకబాదారు. ఈ దాడిలో ఛోటు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై స్పందించిన కోచింగ్ సెంటర్ నిర్వాహకులు ఈ దాడికి పాల్పడ్డ టీచర్ ను విధుల నుంచి తొలగిస్తున్నామని తెలిపారు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.