ఓ భార్య భర్తను నిండా ముంచింది. ప్రభుత్వ ఉద్యోగం ఉందని ఆశతో అతనిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్ళైన కొంత కాలం పాటు భార్యాభర్తల కాపురం సంతోషంగానే సాగింది. అలా సాగుతున్న క్రమంలోనే యువతి జీవితం ఊహించని ములుపు తిరిగింది. ఇలా వచ్చిన మార్పుతోనే ఏకంగా కట్టుకున్న భర్తను కాదని వదిలేసి భర్తను ఒంటరి చేసింది. తాజాగా బిహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఆ మహిళ జీవితంలో జరిగిన ఆ ఊహించని మలుపు ఏంటి? ఆ తర్వాత ఆ వివాహిత ఎలాంటి నిర్ణయం తీసుకుందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అది బిహార్ లోని మాధేపురా జిల్లా కేదార్ ఘాట్. ఇదే ప్రాంతానికి చెందిన మిథున్ గతంలో ప్రభుత్వ ఉద్యోగానికి సిద్దమవుతుతున్న క్రమంలో అతనికి హర్‌ప్రీతి అనే యువతి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త చివరికి ప్రేమగా మారింది. దీంతో చెట్టాపట్టాలేసుకుని కలిసి తిరిగారు. ఆ తర్వాత మిథున్ కు ఉద్యోగం వచ్చింది. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు సహజీవనం చేసి ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు. కొంత కాలానికి భార్య హర్‌ప్రీతికి కూడా పోలీసు శాఖలో ఉద్యోగం రావడంతో సమస్తిపూర్ జిల్లా పటౌరీ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంది.
ఇక ఇప్పటి వరకు బాగానే ఉన్న హర్‌ప్రీతి ఉద్యోగంలో స్థిరపడగానే తన నిర్ణయాన్ని మార్చుకుంది. తన జీవితంలో వచ్చిన ఈ కీలక పరిణామంతో భర్తను కాదని అతనిని విడిచి పెట్టి వెళ్లింది. భార్య ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో భర్త జీర్ణించుకోలేకపోయాడు. భార్యతోనే ఉండాలని పట్టుబట్టాడు. కానీ భార్య మాత్రం అతనితో ఉండేందుకు ఇష్టపడలేదు. ఏం చేయాలో అర్థంకాని మిథున్ భార్య పని చేస్తున్న స్టేషన్ కు వెళ్లి నాకు న్యాయం చేయాలంటూ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. భర్త ఫిర్యాదు అందుకున్న అధికారులు విచారణ చేపడుతున్నారు. తాజాగా బిహార్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్రచర్చనీయాంశమవుతోంది. ఇలా ప్రభుత్వ ఉద్యోగం రాగానే భర్తను పక్కనబెట్టడం ఎంత వరకు కరెక్ట్. భార్య తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమేనా? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.