పిల్లలు అన్నాక చిన్న చిన్న తప్పులు చేయడం సహజం. తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం, లేదంటే ఇలా చేయకూడదని చెప్పాలి. ఇలా కాకుండా కొంతమంది తల్లిదండ్రులు మాత్రం.. పిల్లలు చేసే చిన్న చిన్న పొరపాట్లపై సర్దిచెప్పాల్సింది పోయి.. క్షణికావేశంలో ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ తండ్రి తన కూతురిపై దారుణానికి పాల్పడ్డాడు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసులు కథనం ప్రకారం.. బీహార్ లోని సమిస్తపూర్ ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే భర్తతో గొడవ పడిన భార్య.. ఇటీవల పుట్టింటికి వెళ్లడంతో తన ఇద్దరు కూతుళ్లు తండ్రి వద్దే ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ కూతురు తండ్రి జేబులోంచి రూ. 10 తీసుకుని షాపులో కొనుక్కుంది. అదే రోజు ఆ చిన్నారి తండ్రి జేబులో రూ.10 కనిపించకపోయే సరికి కూతురుని ప్రశ్నించాడు. దీనికి కూతురు సమాధానమిస్తూ… నేనే తీసుకుని బిస్కుట్లు కొనుక్కున్నానని వివరించింది. దీంతో ఆ బాలిక తండ్రి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు.
ఇంట్లో ఉన్న కర్రతో తన కూతురుని దారుణంగా చితకబాదాడు. ఇక ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు.. గొలుసులతో కూతురి కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆ తర్వాత ఆ తండ్రి విచక్షణారహితంగా కూతురికి వాతలు పెట్టాడు. ఇక తండ్రి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ బాలికను స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రిని అరెస్ట్ చేశారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిపాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.