ప్రేమించలేదన్న కారణంతో ఓ ప్రేమోన్మాది కిరాతకానికి పాల్పడ్డాడు. కాపుకాచి వెంట నడిచిన ఆ దుర్మార్గుడు బాలిక ఒంటరిగా కనిపించడంతో తుపాకీతో కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. తాజాగా బిహార్ లో వెలుగు చూసిన ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది బిహార్ పాట్నా పరిధిలోని ఇంద్రపురి. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి కూరగాయాలు అమ్మకుంటూ నివాసం ఉంటున్నాడు. ఇతనికి పెళ్లై 9వ తరగతి చదివే కూతురు కూడా ఉంది. అయితే ఈ బాలికపై స్థానికంగా ఉండే ఓ యువకుడు ప్రేమించాలంటూ గత కొన్ని రోజుల నుంచి వెంటపడుతున్నాడు. ఆ యువకుడి ప్రేమను ఆ బాలిక నిరాకరిస్తూ వస్తుంది. దీంతో విషపు ఆలోచనలను నింపుకున్న ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడేందుకు పథకం రచించాడు.
ఇందులో భాగంగానే బుధవారం రోజు ఆ బాలిక కోసం ఆ యువకుడు కాపు కాచి కూర్చున్నాడు. ఆ అమ్మాయి వచ్చే దారిలో ఉండి అమ్మాయి రాగానే తన వెంట తెచ్చుకున్న తుపాకీతో వెనకాల నుంచి మెడపై కాల్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అయితే ఈ అమ్మాయి కింద పడగానే స్పందించిన కొందరు వ్యక్తులు ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక మెడలో బుల్లెట్ దిగిందని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రేమకు నిరాకరించిందనే కారణంతో బాలికను తుపాకీతో కాల్చిన ప్రేమోన్మాది కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Bihar| A vegetable vendor’s daughter shot yesterday in Indrapuri locality of Sipara area of Beur PS in Patna. Injured girl who was shot in the neck is undergoing treatment in a private hospital. Matter is being said to be a love affair: Patna Police
(Visuals: CCTV footage) pic.twitter.com/kHbddcU2L1
— ANI (@ANI) August 18, 2022