ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అభం,శుభం తెలియని 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు.
దేశంలో రోజు రోజుకు ఊహించని నేరాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిని మించి మరొకరు దారుణాలకు పాల్పడుతూ ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు.. అభం,శుభం తెలియని 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘోరమైన చర్య స్థానికంగా సంచలనంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. బిహార్ పూర్నియా జిల్లాలోలోని డగౌరా ప్రాంతం. ఇక్కడే ఓ 10 ఏళ్ల బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. ఆదివారం కావడంతో ఆ బాలిక తన తోటి స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలోనే అటునుంచి వచ్చిన ఓ యువకుడు ఈ బాలికపై కన్నేశాడు. ఎలాగైన ఆ బాలికతో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే అక్కడున్న పిల్లలందరినీ బెదిరించి ఆ బాలికను గ్రామ శివారులోని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అనంతరం ఆ దుర్మార్గుడు ఆ బాలికపై బలవంతంగా అత్యాచారం చేశాడు.
అంతేకాకుండా ఆ బాలిక మర్మాంగాల్లోకి బలవంతంగా ఇసుక, మట్టిని తోశాడు. తీవ్ర రక్తస్రావం అయి ఆ బాలిక స్ప్రహ తప్పి పడిపోయింది. అయితే చాలా సేపు అయినా కూతురు కనిపించకపోవడంతో ఆ బాలిక తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలించారు. కూతురు జాడ మాత్రం దొరకలేదు. ఇక ఆమె స్నేహితులను అడగగా.. ఓ వ్యక్తి తీసుకెళ్లాడని భయంతో చెప్పారు. దీంతో ఆ బాలిక తల్లిదండ్రులు ఖంగారుపడుతూ వెతికారు. గ్రామ శివారులోని ఓ ప్రదేశంలో కూతురు కిందపడిపోయి కనిపించింది. కూతురిని ఆ స్థితిలో చూసిన ఆ బాలిక తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఇక అక్కడే ఉన్న ఆ దుర్మార్గుడిని గ్రామస్తులు పట్టుకోవాలని చూశారు. కానీ, వారి నుంచి ఆ దుండగుడు తప్పించుకుని పరారయ్యాడు. అనంతరం తల్లిదండ్రులు ఆ బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు తెలిపారు. తాజాగా చోటు చేసుుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై దారుణంగా ప్రవర్తించిన యువకుడి చర్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
बिहार पूर्णिया में 10 साल की मासूम के साथ दरिंदगी
बच्ची के साथ 26 साल के युवक ने रेप किया है।आरोपी युवक ने पहले उसके साथ रेप किया। इसके बाद ब्लीडिंग होने लगी तो प्राइवेट पार्ट में बालू और मिट्टी डाल दी !! pic.twitter.com/KkHHBJvL6g
— Yogita Bhayana योगिता भयाना (@yogitabhayana) April 9, 2023