crime news : తనపై, తన సోదరిణులపై జరిగిన అత్యాచారాలను ప్రశ్నించిన ఓ యువతిపై దారుణానికి ఒడిగట్టాడు ఓ సర్పంచ్. వేధింపులకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టిందన్న కోపంతో ఆమె ముక్కు కోసేశాడు. ఈ సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు… బిహార్, సౌపాల్ జిల్లాలోని లోధ్ గ్రామానికి చెందిన మక్త్‌కిన్ గ్రామానికి సర్పంచ్. అదే గ్రామానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ వేధింపులకు వ్యతిరేకంగా ముగ్గురులోని ఓ యువతి మాత్రం గళం విప్పింది. న్యాయం కావాలంటూ ధర్నాకు దిగింది. తనకు వ్యతిరేకంగా యువతి ధర్నాకు దిగటంపై సర్పంచ్ హర్ట్ అయ్యాడు.
ఆమెపై దాడి చేసి ముక్కు కోసేశాడు. గాయాలపాలైన సదరు యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. బాధిత కుటుంసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దుర్మార్గుడైన సర్పంచ్‌పై ఫిర్యాదు చేశారు. అయితే, సదరు సర్పంచ్ కూడా యువతి కుటుంబంపై ఫిర్యాదు చేశాడు. ఆ కుటుంబం తనపై, తన మద్ధతుదారులపై దాడి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరు పక్షాల ఫిర్యాదులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : వీడియో: అక్కను కూడా వదల్లేదు.. అందుకు ఒప్పుకోలేదని రోడ్డుపైన..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.