crime news : మహిళను లైంగికంగా వేధించిన ఓ రాజకీయ పార్టీ నాయకుడికి జనం చక్కగా బుద్ధి చెప్పారు. ఇంట్లోకి పిలిచి మరీ వేధించిన ఆ పెద్దమనిషిని పోలీస్ స్టేషన్ బయట చావగొట్టారు. ఈ సంఘటన బిహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్, రోహ్‌తాస్ జిల్లాలోని డెహ్రీకి చెందిన జేడీయూ లేబర్ వింగ్ అధ్యక్షుడు నారాయణ్ సింగ్‌కు తను ఉండే ఏరియాలోని మహిళపై మనసైంది. గురువారం ఆమెను ఇంట్లో పనుందని చెప్పి లోపలికి పిలిచాడు. ఆ తర్వాత ఇంటి తలుపులు బిగించి, ఆమెను తన కోరిక తీర్చమన్నాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె అతడినుంచి తప్పించుకుని మేడపైకి వెళ్లింది. సహాయం కోసం గట్టిగా అరిచింది.
ఆ అరుపులు విన్న జనం పెద్ద సంఖ్యలో ఇంటి దగ్గరకు వచ్చారు. మహిళను కాపాడారు. ఆమె దగ్గరలోని మహిళల పోలీస్ స్టేషన్‌కు కంప్లైంట్ ఇవ్వడానికి బయలుదేరింది. ఈ విషయం తెలుసుకున్న నారాయణ్ సింగ్ అనుచరులతో ఆమెను అడ్డగించాడు. కేసు పెడితే దారుణమైన పరిస్థితలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆమె అతడిపై దాడి చేసింది. ఆమెతో వచ్చిన వాళ్లు నారాయణ్ సింగ్‌ను, అతడి అనుచరులను తరిమి తరిమి కొట్టారు. అక్కడే ఉంటే చావు తప్పదని భావించిన అతడు ప్రాణభయంతో పోలీస్ స్టేషన్‌లోకి పరుగులు తీశాడు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : కొత్త సిమ్ కార్డు కొనివ్వలేదని బాలుడు ఏం చేశాడంటే..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.