అప్పుల బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఓ దంపతులు ఓ సెల్ఫీ వీడియోను వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారింది. కట్ చేస్తే.. ఏలేరు నదిలో ఇద్దరి మృతదేహాలు పైకి తేలడంతో ఖచ్చితంగా అవి వరప్రసాద్, మీరా దంపతులవేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖకు చెందిన వరప్రసాద్, మీరా దంపతులు అప్పుల బాధలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నామంటూ ఇటీవల ఓ సెల్ఫీ వీడియో తీసుకుని అప్పటి నుంచి కనిపించకుండాపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలంగా కూడా మారింది. దీంతో వెంటనే స్పందించిన ఆ దంపతుల కుమారుడు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో భాగంగా.. అనకాపల్లి కొప్పాక ఏలేరు కాల్వ వద్ద వారి సెల్ ఫోన్ లు, హ్యాండ్ బాగ్ కనిపించడంతో ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారేమోనని పోలీసులు సైతం అనుమానించారు.
ఇక అప్పటి నుంచి పోలీసులు ఆ దిశగా గజ ఈతగాళ్ల సాయంతో ఏలేరు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. 24 గంటలు గడిచినా వారి ఫలితం లభించలేదు. అయితే తాజాగా అదే కాల్వలో ఓ మహిళ, ఓ వ్యక్తి శవాలు నీటిపై తేలుతూ కనిపించాయి. దీంతో వెంటనే గమనించిన పోలీసులు ఆ మృతదేహాలు కనిపించకుండాపోయిన వరప్రసాద్, మీరా దంపతులవే కావోచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ముందుగా వారి బంధువులను పిలిపించి వరప్రసాద్, మీరా దంపతుల మృతదేహాలేనా? కాదా అన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏలేరు కాల్వ వద్ద వారి సెల్ ఫోన్ లు, హ్యాండ్ బాగ్, బైక్ వదిలివెళ్లిపోయిన రెండు కిలో మీటర్ల దూరంలోనే ఈ మృతదేహాలను నీటిపై తేలడంతో ఖచ్చితంగా వరప్రసాద్, మీరా దంపతుల మృతదేహాలేనని స్థానికులు సైతం అనుమానిస్తున్నారు. మొత్తానికి ఏలేరు నదిలో తేలుతున్న ఆ మృతదేహాలు వరప్రసాద్, మీరా దంపతులవేనా కాదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.