సమాజానికి రక్షణగా నిలవాల్సిన కొందరు పోలీసులు దారి తప్పి ప్రవర్తిస్తున్నారు. సభ్యసమాజం తలదించుకునేలా చేస్తూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఓ లేడీ కానిస్టేబుల్ కోసం ఏకంగా స్టేషన్ లోనే కొట్టుకున్నారు సీఐ, కానిస్టేబుల్. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారుతోంది.
అసలు విషయం ఏంటంటే? ఏపీలోని భీమవరంలో వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో కృష్ణభగవాన్ సీఐగా విధులు నిర్వర్తిస్తుండగా అదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్నాడు రాజేష్. అయితే ఇటీవల ఈ స్టేషన్ లో పని చేస్తున్న ఓ లేడీ కానిస్టేబుల్ రాజేష్ బైక్ ఎక్కుతుండగా చూశాడు సీఐ కృష్ణభగవాన్. ఇదే విషయంపై రాజేష్, సీఐ కృష్ణభగవాన్ గొడవకు దిగారు. మాటా మాటా పెరిగి కొట్టుకునే స్థాయికి వెళ్లారు. కొట్టుకోవద్దని స్టేషన్ సిబ్బంది అడ్డుపడినా కూడా తగ్గేదేలే అంటూ విచ్చలవిడిగా కొట్టుకున్నారు.
ఇక ఓ అమ్మాయి సీఐ, కానిస్టేబుల్ తన్నుకోవడం అనేది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీరి వ్యవహారం పై అధికారుల వరకు వెళ్లడంతో వారిద్దరిపై సీరియస్ అయ్యారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ ఓ అమ్మాయి కోసం కొట్టుకోవడం ఏంటంటూ ఫైర్ అయ్యారు. సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఇలా బరితెగించి కొట్టుకోవడంతో అందరూ వీరి వ్యవహారంపై మండిపడుతున్నారు. న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా చేయడం సిగ్గుచేటు అంటూ స్థానికులు వాపోతున్నారు. ఓ లేడీ కానిస్టేబుల్ కోసం సీఐ, కానిస్టేబుల్ కొట్టుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.