ప్రస్తుతం సమాజంలో దారుణాలకు అడ్డు లేకుండా పోతోంది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా దారుణాలు తగ్గడం లేదు. ఏదొక మూల కిరాతక విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇలా సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా వెలుగు చూసిన ఒక అమానవీయ ఘటన అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. అతని గొంతు, నరాలు కోసేసి చంపేశారు. అసలు ఎందుకు హత్య చేశారో తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. ప్రస్తుతం అతని హత్య రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఈ దారుణం ఆదివారం వెలుగు చూసింది. మృతుడు ముత్యాలంపాడు క్రాస్ రోడ్ పంచాయతీకి చెందిన బీజేపీ మండలాధ్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు అశోక్ కుమార్(24). ఇతను ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. అశోక్ కు అమల అనే యువతితో వివాహం జరిగింది. వారికి రెండు నెలల పాప కూడా ఉంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్ కు చెందిన గుగులోతు ప్రేమ్ కుమార్ తో అశోక్ కు పరిచయం ఉంది. అతనికి అవసరమైనప్పుడల్లా అశోక్ ఆర్థికసాయం చేస్తుండేవాడు. అలా అశోక్ కు ప్రేమ్ కుమార్ రూ.80 వేల వరకు బాకీ పడ్డాడు. ప్రేమ్ కుమార్ పూచీకత్తుతో మరో వ్యక్తికి కూడా అశోక్ అప్పు ఇచ్చాడు. అయితే ఇద్దరినీ తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయాలంటూ అశోక్ ఒత్తిడి చేయడం మొదలు పెట్టాడు. దాంతో అశోక్ పై వాళ్లు కోపం పెంచుకున్నారు.
శనివారం రాత్రి తీసుకున్న డబ్బు ఇస్తామంటూ అశోక్ కు సమాచారం ఇచ్చారు. డబ్బుకోసం అశోక్ ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు చేరుకున్నాడు. అతడిని పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి కట్టేశారు. అతని గొంతు, నరాలు, చీలమండ కోసేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు సమాచారం. రాత్రి వెళ్లిన అశోక్ తెల్లారినా ఇంటికి రాకపోవడంతో బాలాజీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు పంచాయతీ సిబ్బంది అశోక్ మృతదేహాన్ని గుర్తించి.. పోలీసులకు సమాచారంం అందించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు అది అశోక్ మృతదేహంగా గుర్తించారు. అశోక్ కుటుంబసభ్యలు ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. అతడిని కఠరినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ప్రేమ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ఈ హత్య ఆందోళన కలిగిస్తోంది. అప్పుగా ఇచ్చిన సొమ్ము తిరగి అడిగితే హత్య చేశారని తెలుసుకుని భయాందోళనకు గురవుతున్నారు.