భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దొంగలు బరితెగించారు. తాజాగా బ్యాంకు నుంచి నగలు తీసుకొస్తున్న వ్యక్తి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బూర్గంపాడు గ్రామానికి చెందిన సత్యవ్రత అనే వ్యక్తి బ్యాంకు లాకర్లలో దాచుకున్న బంగారు నగల బ్యాగును బైక్ కు తగిలించుకుని బైక్ పై వెళ్తున్నాడు.
అయితే అలా వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో ఓ కిరాణ షాప్ వద్ద నగల బ్యాగును బైక్ తగిలించి ఆపే ప్రయత్నం చేశాడు. దీంతో కాపుకాచిన గుర్తు తెలియని దొంగలు రూ. 1 లక్ష 80 వేల విలువ చేసే నగలను దుండగుడు ఎత్తికెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక వెంటనే తేలుకున్న బాధితుడు లోబోదిబో మంటు మొత్తుకున్నాడు. ఇక భాదితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bhadradri Kothagudem: ఐపీఎల్ బెట్టింగ్: అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న యువకుడు!
ఇక స్థానికంగా ఉండే సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దొంగను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో తాజాగా వెలుగు చూసిన ఈ చోరీ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తెలిసిన వారే చేశారా? లేదంటే ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనా అంటూ పోలీసులు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు ఓ నిఘా పెట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.