ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. అయితే ఉన్నట్టుండి ఈ భార్యభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో అప్పటి నుంచి దంపతులు ఇద్దరు వేరు వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే అతని భార్య మరో యువకుడిపై మనసుపడింది. ఇక అతడు ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో చివరికి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది.
వివాహేతర సంబంధం.. ఇవే పచ్చని కాపురాల్లో నిప్పులు పోస్తున్నాయి. భర్తను కాదని భార్య, భార్యను కాదని భర్త. ఇలా ఒకరికి తెలియకుండ మరొకరు అక్రమ సంబంధాల మోజులో పడి నిండు సంసారాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ ఇల్లాలు.. ప్రియుడు ఇచ్చిన ఆఫర్ నచ్చడంతో ఏకంగా కట్టుకున్న వాడినే అంతమొందించింది. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది కొత్తగూడెం పరిధిలోని సన్యాసి బస్తీ. ఇక్కడే ప్రవీణ్ (32), లావణ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు గత ఐదేళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన నాటి నుంచి కొంత కాలం ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగానే జీవించారు. అలా కొన్ని రోజులు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి భార్యాభర్తల మధ్య ఒక్కసారిగా మనస్పర్థలు భగ్గుమన్నాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అయితే వీరి గొడవ చివరికి పెద్ద మనుషుల పంచాయితీ వరకు వెళ్లింది. దీంతో పెద్దలు నచ్చజెప్పిన వాళ్లు వినకపోవడంతో అప్పటి నుంచి ఇద్దరూ వేరు వేరుగా జీవించారు.
ఈ క్రమంలోనే లావణ్య ఇంటి ఎదురుగా ఉంటున్న సుమంత్ అనే యువకుడిపై మనసు పడింది. దీనికి సుమంత్ కూడా ఓకే అనడంతో ఇద్దరూ ఎంచక్కా చీకటి కాపురాన్ని ప్రారంభించారు. అలా కొంత కాలం పాటు వీరి వివాహేతర సంబంధం మూడు పువ్వులు, ఆరు కాయాలు అన్నట్లుగా సాగింది. అయితే ఈ క్రమంలోనే.. నీ భర్తను వదిలేయ్.. ఎంచక్కా మనం ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ప్రియుడు సుమంత్ చెప్పాడు. ప్రియడు ఇచ్చిన ఆఫర్ ను కాదనని లావణ్య.. సరే నంటూ ప్రియుడితో తన చీకటి కాపురాన్ని నడిపించింది. ఇదిలా ఉంటే అడ్డుగా ఉన్న ప్రవీణ్ ను కూడా చంపాలని లావణ్య, సుమంత్ ప్లాన్ గీసుకున్నారు.
ఈ క్రమంలోనే లావణ్య భర్త ప్రవీణ్.. ఆదివారం భార్య ఇంటికి వెళ్లి ఆమెతో గొడవ పడ్డాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన లావణ్య.. ఇంట్లో ఉన్న రాడ్ తో ప్రవీణ్ తలపై బలంగా బాదింది. ఈ దాడిలో భర్త ప్రవీణ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే స్పందించిన అతని కుటుం సభ్యులు ప్రవీణ్ ను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ప్రవీణ్ తాజాగా ప్రాణాలు విడిచాడు. ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. పోలీసుల విచారణలో లావణ్య వివాహేతర సంబంధం బయటపడింది. దీంతో పోలీసులు పరారీలో ఉన్న లావణ్య, ఆమె ప్రియుడు సుమంత్ లను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గురాలి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.