పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉన్నదాంట్లో సర్దుకుపోతూ నచ్చిన జీవితాన్ని జీవించారు. సంసారం గడవాలంటే పని చేయాలి కాబట్టి ఓ పూజారి వద్ద భార్యాభర్తలిద్దరూ పనికి కుదిరారు. వచ్చిపోయే భక్తులకు సేవలు చేస్తూ కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఇలా ఎంతో సంతోషంగా వీరి కాపురం సజావుగా సాగుతున్న తరుణంలోనే పూజారి వేధింపులు ఎక్కువయ్యాయ. ఏం చేయాలో తెలియక ఈ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరి మరణంతో వీరిద్దరి పిల్లలు అనాథలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లోతువాగి. ఇదే గ్రామానికి చెందిన వెంకటేష్, రాజీలు భార్యాభర్తలు. వీరు పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. కాగా ఇదే గ్రామంలో దేవుడమ్మ పేరుతో మూడ నమ్మకాలతో నగేష్ అనే వ్యక్తి పూజలు చేసేవాడు. అయితే ఇతని వద్ద ఈ దంపతులిద్దరూ పనికి కుదిరారు. వచ్చిపోయే భక్తులకు సేవలు అందించేవారు. ఇలా కొంత కాలం పూజారి నగేష్ వద్దే పని చేసేవారు.
ఇది కూడా చదవండి: Russia: అనుమానాస్పద స్థితిలో మరణించిన ఇంటి ఓనర్.. పీక్కుతిన్న 20 పెంపుడు పిల్లులు!
అయితే గత కొన్ని రోజుల నుంచి పూజారి నగేష్ ఈ దంపతులను వేధింపులకు గురి చేసేవాడని తెలుస్తోంది. దీంతో ఇతని వేధింపులు భరించలేని వెంకటేష్ తన భార్యాపిల్లలతో పాటు పన్నీ ఇంటికి వెళ్లాడు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. ఈ దంపతులు అక్కడ ఉంటున్న విషయం పూజారి నగేష్ తెలిసింది. వెంటనే పరుగు పరుగున వచ్చిన పూజారి భార్యాభర్తలిద్దరిపై తీవ్రంగా దాడి చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆ దంపతులు ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారిపోయారు. ఇక ఈ దంపతుల ఆత్మహత్యకు పూజారి నగేషే ప్రధాన కారణమని వెంకటేష్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.