Woman: కొంతమంది ప్రతీ సమస్యకు ఆత్మహత్యను శాశ్వత పరిస్కారంగా భావిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటమే కాదు.. ఆ ఆలోచనల్లో తలమునకలై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కడుపు నొప్పితో బాధ పడుతున్న ఓ మహిళ అత్యంత దారుణంగా వ్యవహరించింది. కడుపునొప్పి నుంచి తప్పించుకోవటానికి ఆత్మహత్యే శరణ్యం అనుకుంది. అయితే, తాను చనిపోయే ముందు కన్న కూతుర్ని చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెంగళూరుకు చెందిన దీపకు అదే ప్రాంతానికి చెందిన ఆదర్శ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో 2017లో వివాహం అయింది. వీరికి మూడు సంవత్సరాల రియా అనే కూతురు ఉంది. దీప తన భర్త, కూతురితో కలిసి ఆర్‌ఆర్ నగర్‌లోని మంత్రి అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. దీప గత వారం రోజులనుంచి జ్వరంతో బాధపడుతోంది. అంతేకాదు! జ్వరం కారణంగా విపరీతమైన కడుపునొప్పి కూడా రావటం మొదలైంది.
చికిత్స చేయించుకున్నా ఫలితం లేకపోయింది. కడుపు నొప్పి తగ్గలేదు. దీంతో కడుపు నొప్పి తట్టుకోలేకపోయిన దీప ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తను చనిపోతే కుమార్తె ఒంటరి అవుతుందని భావించింది. కుమార్తెను కూడా చంపాలని నిశ్చయించుకుంది. శుక్రవారం రాత్రి నిద్రలో ఉన్న కుమార్తె గొంతు నులిమి చంపేసింది. అనంతరం ఓ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌లో ‘‘నా చావుకు ఎవరూ కారణం కాదు.. జీవితం మొత్తం చెత్తతో నిండి ఉందని నేను ఫీలవుతున్నాను.
అమ్మ, దివ్య మీకు సారీ.. లవ్ యూ సోనా’’ అని రాసింది. ఆ వెంటనే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Bengaluru: దుబాయిలో భర్త.. మామతో బెడ్ రూంలో కోడలు! చివరికి ట్విస్ట్ ఏంటంటే?