నవ్య హత్య కేసులో పోలీసులకు పలు విస్తుపోయే విషయాలు తెలిశాయి. నిందితుడు నవ్య పేరు, బొమ్మను గుండెలపై ట్యాటూ వేయించుకున్నాడు. నవ్య మీద అంత ప్రేమ ఉన్న అతడు ఆమెను అనుమానపడి..
సంచలనం సృష్టించిన నవ్య హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె ప్రియుడు, నిందితుడు అయిన ప్రశాంత్‌ను పోలీసులు విచారించగా పలు కీలక విషయాలను వెల్లడించాడు. ప్రశాంత్ గుండెలపై నవ్య పేరు, ఆమె బొమ్మ ట్యాటూ రూపంలో ఉండటం గుర్తించారు. అంతేకాదు! నిందితుడికి, నవ్యకు మధ్య మూడు నెలల క్రితం గొడవైంది. ప్రశాంత్ తన కూతురిని ఇబ్బంది పెడుతున్నాడని అంటూ ఆమె తల్లి కోరమంగల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నవ్య జోలికి పోవద్దని హెచ్చరించారు. అయితే, ప్రేమలో గొడవల సహజం కాబట్టి, ఇద్దరూ మళ్లీ కలిసిపోయారు.
ఆ తర్వాత నవ్య వేరే వ్యక్తితో రిలేషన్‌లో ఉందని అనుమాన పడుతూ వచ్చాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్యా గొడవలు జరుగుతూ వచ్చాయి. నవ్య తీరుతో విసుగు చెందిన ప్రశాంత్ ఆమెపై బాగా కోపం పెంచుకున్నాడు. కానీ, ఆ కోపాన్ని బయటకు వ్యక్త పర్చలేదు. ఏప్రిల్ 14న ఆమె పుట్టిన రోజును ఘనంగా జరపాలని ప్రశాంత్ భావించాడు. అతడి రూమ్‌లో భారీ ఏర్పాట్లు చేశాడు. రాత్రి ఆమెను పార్టీకి పిలిచాడు. ఆ రాత్రి పుట్టిన రోజు వేడుకలు బాగా జరిగాయి. ఎంతో సంతోషంగా నవ్య కేక్ కట్ చేసింది. ప్రశాంత్‌కు కేకు తినిపించి సంబరపడిపోయింది. అయితే, కొద్ది సేపటి తర్వాత నవ్య తన మొబైల్ ఫోన్‌తో వాష్‌రూముకు వెళ్లింది. దీంతో ప్రశాంత్‌కు కోపం వచ్చింది. ఆమె బయటకు వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్ తనకు ఇవ్వాలని కత్తితో బెదిరించాడు. ఆమె ఫోన్ ఇచ్చిన తర్వాత కత్తితో గొంతు కోసి చంపేశాడు.
కర్ణాటకలోని కనకపురకు చెందిన 24 ఏళ్ల నవ్య, ప్రశాంత్‌లు దూరపు బంధువులు. నవ్య ఓ పోలీస్ స్టేషన్‌లో క్లర్క్‌గా పని చేస్తూ ఉన్నాడు. ఇద్దరూ బంధువులు కావటంతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. గత కొన్ని నెలలు నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటూ ఉన్నారు. ఫోన్లు, చాటింగ్‌లు చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నవ్య మీద ప్రశాంత్‌కు అనుమానం వచ్చింది. ఆ అనుమానం చివరకు నవ్య ప్రాణాలు తీసింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.