బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. సొంత వదినపై మరిది రాక్షసుడిలా ప్రవర్తించాడు. అమ్మ తర్వాత అమ్మ అనే కనికరంగా లేకుండా కర్కశంగా బరితెగించి పట్టపగలే కొడవలితో హత్య చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుబ్లీ జిల్లాని కుందగోళ పరిధిలోని ఏరినారాయణపర. ఇదే గ్రామంలో మంజునాథ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఓ అన్న కూడా ఉన్నాడు. అయితే ఇతని సోదరుడికి సునంద అనే మహిళతో గతంలో వివాహం జరిగింది.
పెళ్లైన కొన్ని రోజుల పాటు సునంద భర్తతో పాటు బాగానే ఉంది. కానీ గత కొన్నిరోజుల వీరి కుటుంబ సభ్యుల మధ్య ఏదో గొడవ నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ గొడవల నేపథ్యంలోనే సునందపై ఆమె మరిది మంజునాథ కోపంతో రగిలిపోయాడు. ఇటీవల సునందపై మంజునాథ విరుచుకుపడ్డారు. కోపంతో ఊగిపోయిన మంజునాథ పట్టపగలు అందరూ చూస్తుండగానే కొడవలితో సునందను దారుణంగా హత్య చేశాడు. మరిది దాడిలో సునంద రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ సీన్ చూసిన స్థానికులు అంతా షాక్ కు గురయ్యారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఇక అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఈ హత్యకు ప్రధాన కారణం ఏంటి? వివాహేతర సంబంధాల కారణంగానే మంజునాథ వదినను చంపాడా? లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.