ఈ రోజుల్లో చాలా మంది యువత ప్రేమ పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ప్రేమిస్తున్నామని వెంటపడడం.., కాదంటే హత్యలు, ఆత్మహత్యలకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే బరితెగించిన ఓ వన్ సైడ్ లవర్ లవ్ యూ అంటూ ప్రియురాలికి దగ్గరవుదామని ప్రయత్నించాడు. కానీ అతని ప్రయత్నం బెడిసికొట్టడంతో చివరికి ప్రియురాలిపై దారుణానికి తెగబడ్డాడు. అసలు ఈ స్టోరీలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పడు తెలుసుకుందాం. బెంగుళూరులోని రామ్ నగర్ ప్రాంతంలో ఓ యువతి, యువకుడు గత మూడేళ్లుగా ఒకే షోరూంలో పని చేస్తున్నారు.
అలా ఇద్దరు కలిసి పని చేస్తుండడంతో యువతి మనోడితో కాస్త సన్నిహితంగా మెలిగింది. దీనినే క్యాష్ చేసుకున్న మనోడు ఐ లవ్ అంటూ ఆ యువతికి దగ్గరయ్యే ప్రయత్నం చేశాడు. కానీ ఆ యువతి మాత్రం అతని ప్రేమకు నిరాకరించి అతనికి నో చెప్పింది. అలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడేళ్ల పాటు పిచ్చోడిలా ఆ యువతి వెనకాల నీడలా తిరిగాడు. అయినా మనోడి ప్రేమకు ఆ యువతి అస్సలు కరగలేదు. దీంతో సహనం కోల్పోయిన ఆ యువకుడు ఇటీవల ప్రియురాలి ఉంటున్న ఇంటికి వెళ్లాడు. మెల్లగా ఆ యువతి ఇంట్లో వెళ్లి పట్టపగలు కత్తితో ప్రియురాలిపై దాడికి దిగాడు. అనంతరం ఆ యువకుడు సైతం తన గొంతు కోసుకున్నాడు.
ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఇద్దరినీ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికత్స అందించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇలా ఎంతో మంది యువతి యువకులు తనకు దక్కనిది మరొకరికి దక్కనివ్వను అనే సినిమా డైలాగ్ ను పక్కాగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అచ్చం ఇలాగే చేసిన ఈ కిరాతకుడి దారుణం స్థానికులు మండిపడుతున్నారు.