వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలకాలం కలిసి జీవించాలనుకున్నారు. కానీ కొన్ని పరిస్థితుల మధ్య ప్రియురాలు ప్రియుడిని కాదని మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇక అప్పుడు మనోడికి ఏం చేయాలో అర్థంకాక పిచ్చోడిలా తయారయ్యాడు. కట్ చేస్తే పెళ్లి చేసుకున్న ప్రియురాలి బెడ్ రూంలోకి ప్రియుడు అర్థరాత్రి దూరిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
బెంగుళూరుని నాగవార ప్రాంతం. ఇక్కడే ఉన్న కాఫీడేలో సౌమ్య, సుబ్రహ్మణ్యం అనే యువతి, యువకుడు పని చేస్తున్నారు. కొన్నిరోజులు గడిచాక ఇద్దరు కాస్త దగ్గరయ్యారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. అలా కొన్నాళ్లకి ఇద్దరు ప్రేమించుకుని ప్రేమ విహారంలో తేలియాడారు. సౌమ్య.. నువ్వు లేకుండా నేనుండలేను, నువ్వే సర్వస్వం అంటూ కొన్ని మాటలు అల్లి ప్రియుడు సుబ్రహ్మణ్యంని దగ్గర చేసుకుంది. ఇదంతా నిజమేనని నమ్మిన సుబ్రహ్మణ్యానికి ప్రియురాలు ఒక్కసారిగా కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇలా కొన్నాళ్ల నుంచి పని చేస్తున్న కాఫీడేలో సౌమ్య పని మానేసి వెళ్లిపోయింది.
ఏం జరిగిందని ప్రియుడు తెలుసుకోగ.., ఆమె ఇటీవలే మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న సుబ్రహ్మణ్యం తట్టుకోలేకపోయాడు. ఇక ఎలాగైన ప్రియురాలిపై కక్షతీర్చుకోవాలని సుబ్రహ్మణ్యం కంకణం కట్టుకున్నాడు. సమయం కోసం ఎదురు చూశాడు. ఆ రోజు కూడా రానే వచ్చింది. సౌమ్య ఇంట్లో ఒంటరిగా ఉందని తెలుసుకున్న ప్రియుడు ఇంట్లోకి దూరి కత్తితో ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ సౌమ్య అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.