సమాజంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే భయమేస్తుంది. మూడేళ్ల చిన్నారి నుంచి ఫించన్ తీసుకునే ముసలవ్వల వరకు.., ఇలా ఎవరినీ వదలకుండా అత్యాచారం చేస్తున్నారు. గుడి, బడి అని తేడా లేకుండా కొందరు కేటుగాళ్లు అడ్డగోలుగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు అన్న కూతురిని మూడేళ్లుగా బెదిరించి అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దక్షిణ కన్నడ జిల్లా మంగుళూరులో ఓ మైనర్ (17) బాలిక బాబాయ్, చిన్నమ్మల వద్ద నివాసం ఉంటుంది. 9వ తరగతి వరకు చదువుకున్న ఆ బాలిక చదువు మానేసి అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది. అయితే చిన్నాన్న ఆ బాలికను బెదిరిస్తూ అత్యాచారానికి దిగేవాడు. ఇది ఎవరికైన చెబితే చంపేస్తానని.. ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా మూడేళ్ల నుంచి ఆ బాలికను అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే ఇటీవల ఆశా కార్యకర్త ఆ బాలికను గమనించి కడుపుతో ఉన్నట్లు గుర్తించింది.
ఏం జరిగిదని ఆ బాలికను ఆశా కార్యకర్త ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తన చిన్నాన్న గత మూడేళ్ల నుంచి బెదిరిస్తూ అత్యాచారం చేస్తున్నాడని వాపోయింది. ఇదే విషయం చివరికి పోలీసుల వరకు వెళ్లడంతో పోలీసులు ఆ మైనర్ బాలికను ప్రశ్నించారు. నిజమేనని తేలడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బాలిక చిన్నానని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.