వాళ్లిద్దరూ భార్యాభర్తలు. పెళ్లై 9 ఏళ్లు అవుతుంది. ఇద్దరు సాఫ్ట్ వేర్ కొలువులు చేస్తూ ఆర్థికంగా కూడా బలంగానే ఉన్నారు. ఎంతో సంతోషంగా వీరి దాంపత్య జీవితం సంతోషంగా సాగుతూ వస్తుంది. అయితే ఈ క్రమంలోనే భర్త ఉన్నట్టుండి తన రూట్ ను మార్చేసి భార్యపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. అసలు విషయం తెలిసి భార్య తీవ్ర మనస్థాపానికి గురై ఊహించని నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాది నుంచి వలస వచ్చిన రంజన్ రావత్, ఉపాసన (30) అనే దంపతులు బెంగుళూరులోని మహాదేవపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి 9 ఏళ్ల క్రితం పెళ్లైంది.
భార్యాభర్తలిద్దరూ సాప్ట్ వేర్ కొలువులు చేస్తూ కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలా వీరి సంసారం సాఫీగానే సాగుతూ వస్తుంది. కానీ పెళ్లై 9 ఏళ్లు గడుస్తున్నా వీరికి ఇంకా పిల్లలు కలగలేదు. దీంతో అనేక ఆస్పత్రుల చుట్టు చెప్పులు అరిగేలా తిరిగారు, కానీ ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో ఇద్దరు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఇలా వీరి సంసారం గడుస్తున్న క్రమంలోనే భర్త వక్రమార్గంలోకి వెళ్లాడు. పిల్లలు కలగడం లేదన్న కారణంతో భర్త రంజన్ రావత్ భార్యను మానసికంగా, లైంగికంగా వేధించడంతో పాటు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడేవాడు.
ఇక భర్త టార్చర్ ను భార్య భరించలేకపోయింది. ఇక నా వల్ల కాదని భావించి.., భర్త రంజన్ రావత్ తో విడాకులకు సిద్దమైంది. ఈ క్రమంలోనే భర్త వేధింపులను తట్టుకోలేని భార్య భార్య ఉపాసన.. నా భర్త గత కొంత కాలం నుంచి శారీరకంగా, లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంతటితో ఆగకుండా పిల్లలు కలగడం లేదని బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు. దీంతో అతడి టార్చర్ ను భరించలేక చనిపోతున్నానంటూ.. సూసైడ్ నోట్ రాసి ఉపాసన ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.