మారిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని దేశంలో కొందరు సైబర్ నేరగాళ్లు ఊహకు అందని నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సైబర్ నేరాలు మన దేశంలో రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇకపోతే అందాన్ని ఆసరాగా చేసుకుని ఎంతోమంది అమ్మాయిలు హనీట్రాప్ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ యువతి ఏకంగా బట్టల షాపులో పనికి కుదిరింది. ఇంతటితో ఆగకుండా ఆ షాపు యజమానిని తన ముగ్గులోకి దింపింది. మెల్ల మెల్లగా అతని షాపులో పని చేస్తూ అతనితోనే శారీరకంగా కూడా కలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలా తన ట్రాప్ లోకి దింపుకున్న ఆ మహిళ ఉద్యోగి హనీట్రాప్ లో భాగంగా యజమాని వద్ద ఏకంగా రూ.48 లక్షల దోచుకుని అంతనికి పంగనామాలు పెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలు ఈ ఘటన వెనుక ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
బెంగుళూరులోని బనశంకరి పరిధిలో నగర్తపేటే ప్రాంతంలో విక్రంజైన్ (43) అనే వ్యక్తి స్థానిక పట్టణంలో ఓ బట్టల షాపును నడిపిస్తున్నాడు. అయితే 2020లో విక్రంజైన్ షాపులో మైత్రి అనే యువతి పనికి కుదిరింది. దీంతో అప్పటి నుంచి ఆ యువతి అతడి వద్దే నమ్మకంగా పని చేస్తూ వచ్చింది. అలా రెండేళ్లు గడిచింది. ఈ కాలంలోనే షాపు యజమాని ఆ యువతితో సన్నిహితంగా మెలిగి చివరికి శారీరకంగా కూడా కలుసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే ఇన్నేళ్ల తర్వాత ఆ యువతి తన అసలు రూపాన్ని బయటపెట్టింది. విషయం ఏంటంటే? ఇటీవల తన సోదరుడికి రోడ్డు ప్రమాదం జరిగిందని, నాకు అర్జెంట్ గా రూ.2 లక్షలు కావాలంటూ షాపు యజమానిని కోరింది. ఆ యువతి బాధగా అలా అడగడంతో ఆ యజమాని వెంటనే రూ.2 లక్షలు మైత్రికి ఇచ్చాడు.
అలా కొన్ని రోజుల తర్వాత మైత్రి యజమానికి ఫోన్ చేసి.. కేజీ రోడ్డు బెంగుళూరు గేట్ వద్దకు రావాలంటూ కబురు పంపింది. ఇది విన్న విక్రంజైన్ వెనకా ముందు ఏం ఆలోచించకుండా అక్కడికి వాలిపోయాడు. ఇదిలా ఉంటే విక్రంజైన్ రావడం కంటే ముందుగానే మైత్రి తన సోదరులతో ఓ రూమ్ లో రెడీగా ఉంది. అయితే విక్రంజైన్ రాగానే.. మైత్రి స్పందించి.. నాకు రూ.8 లక్షలు ఇవ్వాలి, లేదంటే మన మధ్య ఉన్న శారీరక సంబంధాన్ని ప్రచారం చేసి నీ పరువు తీస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీంతో అప్పుడు మనోడికి నోట మాట రాలేదు. ఆ క్షణాన విక్రంజైన్ కు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. దీంతో మైత్రి చెప్పినట్లు విక్రంజైన్ వెంటనే రూ.8 లక్షలు మైత్రికి చెల్లించాడు. అలా దశలవారిగా మైత్రి విక్రంజైన్ నుంచి రూ. 48 లక్షల వరకు కాజేసినట్లు సమాచారం. దీంతో ఏం చేయాలో తెలియక విక్రంజైన్ ఇటీవల పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.