బెంగుళూరులో దారుణం చోటు చేసుకుంది. తిండి పెట్టేందుకు డబ్బులు లేవని ఓ కసాయి తండ్రి కన్న కూతురని చూడకుండా చెరువులో తోసి చంపేశాడు. అయితే ముందుగా కూతురితో పాటు చెరువులోకి దూకి తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. కానీ ఊపిరాడక కూతురు మరణించడంతో తండ్రి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలకంగా మారుతోంది. గుజరాత్ కు చెందిన రాహుల్ అనే వ్యక్తి సాఫ్ట్ వేర్ ఉద్యోగి పని చేస్తున్నాడు. ఇతనికి పెళ్లై రెండేళ్ల కూతురు కూడా ఉంది. భార్య, కూతురితో పాటు రాహుల్ బెంగుళూరులోనే నివాసం ఉంటున్నాడు.
ఇప్పటి వరకు బాగానే ఉన్నా.. గత ఏడాది నుంచి రాహుల్ బిట్ కాయిన్ లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాడు. ఇదే కాకుండా ఇంట్లో ఉన్న బంగారు అభరణాలు అన్నీ కుదువ పెట్టడం, 6 నెలల క్రితం అతని జాబ్ పోయింది. వీటన్నిటినీ తట్టుకోలేకపోయిన రాహుల్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ సమయంలోనే రాహుల్ కు ఏం చేయాలో అర్థం కాలేదు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాహుల్ కుటుంబం గడవడమే కష్టంగా మారింది. ఈ సమయంలోనే రాహుల్ తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు.
ఇక ఇందులో భాగంగానే ఇటీవల తన కూతురుని తీసుకుని బెంగుళూరు సిటీ శివారులోకి వెళ్లాడు. అక్కడికి వెళ్లాక అతని కూతురుకి ఓ చాక్లెట్ ఇచ్చాడు. ఆ చిన్నారి చాక్లెట్ తింటూ ఉంటుండగా.. రాహుల్ కూతురుని తీసుకుని చెరువులోకి దూకాడు. దీంతో ఊపిరాడకపోవడంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోగా తండ్రి రాహుల్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయం మెల్ల మెల్లగా చివరికి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాహుల్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రాహుల్ కూతురితో పాటు తానూ కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.