నేటి కాలంలో కొందరు ప్రియుడు కోసం కన్నవాళ్లను, కట్టుకున్నవాళ్లను ఎంతటి వారినైన సరే హత్య చేయటానికైన, మెసం చేయటానికైన వెనకాడటం లేదు. ఆ సమయంలో వారికి నా అనుకున్నవాళ్లకన్న ప్రియుడే ఎక్కవవుతున్నాడు. ఇలా భర్తను వదిలేసిన ఓ మహిళ చివరికి ప్రియుడి కోసం ఏకంగా తల్లినే మోసం చేసి అడ్డంగా బుక్కైన ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక విషయం ఏంటంటే? జక్కూరు లే ఔట్ లో నివాసం ఉంటున్న దీప్తి అనే మహిళకు గతంలోనే వివాహం జరిగింది. కానీ కొన్నాళ్లకు భర్త నుంచి మనస్పర్ధలు రావడంతో దీప్తి అతనితో విడాకులు తీసుకుని తల్లితో పాటు ఉంటుంది. అయితే ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆ మహిళకు ఓ ఆలోచన తట్టింది. అదే డ్రైవింగ్ నేర్చుకోవడం. ఇలా తాను డ్రైవింగ్ నేర్చుకుంటున్న తరుణంలో ఆ డ్రైవింగ్ స్కూల్ లో పని చేస్తున్న మదన్ అనే వ్యక్తితో దీప్తికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా రూపుదాల్చింది.
ఇది కూడా చదవండి: Bachupally: చెల్లెలిపై అత్యాచారం చేసిన అన్న!
దీంతో ప్రియుడితో ఎంచక్కా విచ్చలవిడిగా తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేది. విలాసాలకు డబ్బులు లేకపోవడంతో దీప్తి ఇంట్లో ఉన్న నగలను ఏకంగా ప్రియుడికి అప్పజెప్పింది. దీంతో కొన్నాళ్లకి ఇంట్లో నగలు కనిపించకపోవడంతో తల్లికి దీప్తి మీద అనుమానం పెరిగింది. దీంతో దీప్తిని తల్లి నిలదీసేసరికి నోట్లో నీళ్లు నమిలింది. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూతురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఎట్టకేలకు పోలీసుల విచారణలో దీప్తి నేనే తీశానని, ఆ తర్వాత నా ప్రియుడికి ఇచ్చానంటూ తెలిపి అడ్డంగా బుక్కైంది. ఇక పోలీసులు దీప్తితో పాటు ఆమె ప్రియుడిని కూడా అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.